ESIC: ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ న్యూఢిల్లీలో టీచింగ్ పోస్టులు
న్యూఢిల్లీ బసాయిదరాపూర్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 38 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ESIC Recruitment: న్యూఢిల్లీ బసాయిదరాపూర్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 38 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు టీచింగ్/ రిసెర్చ్ విభాగంలో పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రూ.225. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా& ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 2 వరకు ఇంటర్వ్యూకి హాజరు కావొచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 38
* టీచింగ్ పోస్టులు
ప్రొఫెసర్: 07 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్: 17 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్: 14 పోస్టులు
విభాగాలు: జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, నేత్ర వైద్యం, పల్మనరీ మెడిసిన్ / టీబీ చెస్ట్(DM), డెర్మటాలజీ, ఓబీజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియాలజీ, అనస్థీషియా, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎస్‌టీ, బ్లడ్ బ్యాంక్.
అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు టీచింగ్/ రిసెర్చ్ విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: 67 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.225. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా& ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
వేతనం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.2,22,543. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,47,986. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ. 1,27,141.
ఇంటర్వ్యూ తేది: 02.02.2024.
ఇంటర్వ్యూ వేదిక: Dean Office, 5th Floor, MS Office Building, ESI-PGIMSR, Basaidarapur, New Delhi – 110015.
Notification
ESIC: హైదారాబాద్ ఈఎస్‌ఐసీలో 146 ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ESIC Jobs: హైదారాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ- 59, సీనియర్ రెసిడెంట్/ట్యూటర్- 80 & స్పెషలిస్ట్- 05 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 146 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్/ట్యూటర్ పోస్టులకి నిబంధనల ప్రకారం టీచీంగ్ అర్హత, సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్/ సీనియర్ లెవెల్), స్పెషలిస్ట్ పోస్టులకి ఎంబీబీఎస్ ఉండాలి. దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్సీ/ఎస్టీ/మహిళ/ఎక్స్ – సర్వీస్‌మెన్ & దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు ఉన్న వారు జనవరి 29 నుంచి ఫిభ్రవరి 8 వరకు ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈఎస్‌ఐసీ చెన్నైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
చెన్నైలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 37 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ పీజీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 45 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్సీ/ఎస్టీ/మహిళ/ఎక్స్ – సర్వీస్‌మెన్ & దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 1,2వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావొచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.