HMFWD: పశ్చిమగోదావరి జిల్లా వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు, వివరాలు ఇలా
ఏలూరులోని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏలూరులోని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో అక్టోబరు 27లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 04
➥ ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 03 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. బీఎస్సీ (ఆడియోలజీ)/డిప్లొమా (ఆడియోమెట్రీ టెక్నీషియన్) లేదా బీఎస్సీ (స్పీచ్ & లాంగ్వేజ్ సైన్సెస్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (ఆడియోలజీ/స్పీచ్ & లాంగ్వేజ్ పాథాలజీ).
➥ ప్లంబర్: 01 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.08.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు,
దరఖాస్తు ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఏలూరులోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో అందజేయాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
జీతం: నెలకు ఆడియోమెట్రీషియన్‌కు రూ.32,670. ప్లంబర్‌కు రూ.15,000.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 27.10.2023.
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: DCHS Office, Eluru.
Notification & Application
Website
ALSO READ:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
పూణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 6లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నిమ్‌హాన్స్‌లో 161 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ విభాగంలో డిగ్రీతోపాటు తగిన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 18 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1,180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.885 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ అర్హతతో 436 ఎయిర్‌పోర్ట్ కొలువులు - ఎంపిక ఇలా!
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్ కేంద్రాల్లో అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..