AAICLAS: ఇంటర్ అర్హతతో 436 ఎయిర్‌పోర్ట్ కొలువులు - ఎంపిక ఇలా!
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్అ సిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్ కేంద్రాల్లో అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
* అసిస్టెంట్ (సెక్యూరిటీ): 436 పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సామాన విద్యార్హత ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషలో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.10.2023 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: చెన్నై, కోల్‌కతా, గోవా, కోజికోడ్, వారణాసి, శ్రీనగర్, వడోదర, తిరుపతి, వైజాగ్, మధురై, తిరుచ్చి, రాయ్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్, అగర్తల, గ్వాలియర్, అమృత్‌సర్, లేహ్, డెహ్రాడూన్, పుణె, ఇండోర్, సూరత్.
జీత భత్యాలు: నెలకు రూ.21,500 నుంచి రూ.22,500.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ముఖ్య తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20.10.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.11.2023.
ALSO READ:
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 496 పోస్టులని భర్తీ చేయనున్నారు. బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీటీ, వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్ సబ్‌స్టాన్స్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 14న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..