అన్వేషించండి

APPSC DEO Posts: డీఈవో పోస్టులకు పీజీ అవసరమా? ఏపీపీఎస్సీని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు!

APPSC: డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(DEO) ఈ పోస్టులకు పీజీ డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. డీఈవో పోస్టుకు పీజీ అర్హత ఎందుకని ఏపీపీఎస్సీని వారు ప్రశ్నిస్తున్నారు.

APPSC DEO Qualifications: ఏపీలో ఇటీవల విడుదలైన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(DEO) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) డిగ్రీని విద్యార్హతగా నిర్ణయించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టులకు డిగ్రీ అర్హత ఉండగా.. డీఈవో పోస్టుకు పీజీ అర్హత ఎందుకని ఏపీపీఎస్సీని వారు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ మంది అభ్యర్థులు డిగ్రీ తర్వాత బీఈడీ చేస్తారు. ఆ తర్వాత ప్రైవేటు టీచర్‌గానో.. ఇతరత్రా బోధన పోస్టుల్లోనో చేరుతుంటారు. ఇప్పుడు డీఈవో పోస్టుకు పీజీ తప్పనిసరని చెప్పడంతో ఇలాంటి వారు అర్హత కోల్పోవాల్సి వస్తుంది. 

ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DEO) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేసినసంగతితెలిసిందే. పీజీ డిగ్రీతోపాటు, బీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

వివరాలు..

* డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (డీఈవో) పోస్టులు

ఖాళీల సంఖ్య: 38.

జోన్లవారీగా ఖాళీలు: జోన్-1: 07 పోస్టులు, జోన్-2: 12 పోస్టులు, జోన్-3: 08 పోస్టులు, జోన్-14: 11 పోస్టులు.

అర్హత: పీజీ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.  

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, మెయిన్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం: రూ.61,960 – రూ.1,51,370. 

పరీక్ష విధానం..

➥ స్క్రీనింగ్ పరీక్ష: మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కాగా.. తప్పు సమాధానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.

➥ మెయిన్ పరీక్ష: మొత్తం 450 మార్కులు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2: ఎడ్యుకేషన్-1కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-3: ఎడ్యుకేషన్-2కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కాగా.. తప్పు సమాధానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.

➥ కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.01.2024. (11:59 PM)

➥ స్క్రీనింగ్ పరీక్ష తేది: 13.04.2024.

Notification

Website

                                  

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget