BARC: 'బార్క్'లో ఉద్యోగ పరీక్షల తేదీలు వెల్లడి, పూర్తి షెడ్యూలు ఇలా!
ముంబయిలోని భాభా అణు పరిశోధనా కేంద్రం(బార్క్)లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత(సీబీటీ) ప్రిలిమినరీ పరీక్షల తేదీలను సంస్థ అక్టోబరు 20న వెల్లడించింది.
ముంబయిలోని భాభా అణు పరిశోధనా కేంద్రం(బార్క్)లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత(సీబీటీ) ప్రిలిమినరీ పరీక్షల తేదీలను సంస్థ అక్టోబరు 20న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
బార్క్‌లో 4374 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. వీటిలో టెక్నికల్ ఆఫీసర్-181 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్-07 పోస్టులు, టెక్నీషియన్-24 పోస్టులు, స్టైపెండరీ ట్రైనీ-4162 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 24 నుంచి మే 22 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్నవారికి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000; కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష విధానం...
మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 50 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో మ్యాథమెటిక్స్-20 ప్రశ్నలు-60 మార్కులు, సైన్స్-20 ప్రశ్నలు-60 మార్కులు, జనరల్ అవేర్‌నెస్-10 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పుడు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్ కేటగిరి అభ్యర్థులకు 40 (60 మార్కులు) శాతంగా, రిజర్వ్‌డ్ కేటిగిరీలకు 30 (50 మార్కులు) శాతంగా నిర్ణయించారు.
నోటిఫికేషన్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
TS SET - 2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఎస్ సెట్)-2023 పరీక్ష హాల్‌టికెట్లను ఉస్మానియా యూనివర్సిటీ అక్టోబరు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. టీఎస్ సెట్-2023 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్టికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 28 - 30 వరకు టీఎస్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు ప్రభుత్వం ఏటా టీఎస్ సెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణ బాధ్యతను ఉస్మానియా విశ్వవిద్యాలయం చేపట్టింది.
టీఎస్ సెట్-2023 హాల్‌టికెట్ల కోసం క్లి్క్ చేయండి..
ఎన్టీపీసీలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, ఇంజినీరింగ్‌తోపాటు ఈ అర్హతలుండాలి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) గేట్-2023 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 495 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనంగా ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..