![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BEL Recruitment 2021: ఎలాంటి పరీక్షలు లేకుండానే బెల్‌లో ఉద్యోగాలు... రూ.50 వేల వరకు జీతం...
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రెయినీ ఇంజనీర్, ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు స్వీకరణ ఆగస్టు 15తో ముగుస్తుంది.
![BEL Recruitment 2021: ఎలాంటి పరీక్షలు లేకుండానే బెల్‌లో ఉద్యోగాలు... రూ.50 వేల వరకు జీతం... BEL Recruitment 2021 for 511 Trainee Engineer & Project Engineer Posts BEL Recruitment 2021: ఎలాంటి పరీక్షలు లేకుండానే బెల్‌లో ఉద్యోగాలు... రూ.50 వేల వరకు జీతం...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/07/a1f0ff7d54420db5dd0e168936bc50e8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), బెంగళూరు యూనిట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 511 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు ఆగస్టు 15వ తేదీతో ముగియనుంది. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తోంది. ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
దీని ద్వారా ట్రెయినీ ఇంజనీర్ 1, ప్రాజెక్టు ఇంజనీర్ 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బెల్ తెలిపింది. అకడమిక్ మార్కుల్లో మెరిట్, పోస్టులకు సంబంధించిన రంగాల్లో అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాల కోసం https://bel-india.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించింది.
విద్యార్హత వివరాలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బీఈ/ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్/ టెలీ కమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ట్రెయినీ ఇంజనీర్ పోస్టులకు ఫ్రెషర్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయో పరిమితి, దరఖాస్తు ఫీజు..
ట్రెయినీ ఇంజనీర్ పోస్టులకు 2021 ఆగస్టు 1 నాటికి గరిష్టంగా 25 ఏళ్ల వయసు ఉండాలి. ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులకు 2021 ఆగస్టు 1 నాటికి 28 ఏళ్ల వయసు మించకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయో పరిమితి ఉంది.
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు.. ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 పోస్టులకు రూ.500, ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: SSB Head Constable Recruitment 2021: ఎస్ఎస్‌బీలో హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. రూ.81 వేల వరకూ జీతం..
రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాలు..
1. ట్రెయినీ ఇంజనీర్ 1 పోస్టులు (308)
జనరల్- 124
ఈడబ్ల్యూఎస్- 31
ఓబీసీ- 83
ఎస్సీ- 47
ఎస్టీ- 23
2. ప్రాజెక్టు ఇంజనీర్ 1 పోస్టులు (203)
జనరల్- 84
ఈడబ్ల్యూఎస్- 21
ఓబీసీ- 54
ఎస్సీ- 30
ఎస్టీ- 14
రూ.50 వేల వరకూ జీతం..
ట్రెయినీ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.25000, రెండో సంవత్సరం నెలకు రూ.28000, మూడో సంవత్సరం నెలకు రూ.31000 వేతనం చెల్లించనున్నారు.
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ. 35000, రెండో సంవత్సరం నెలకు రూ. 40,000, మూడో సంవత్సరం నెలకు రూ. 45,000, నాలుగో సంవత్సరం నెలకు రూ.50,000 వేతనంగా అందిస్తారు.
Also Read: BEL Recruitment 2021: బెల్ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగాలు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)