BECIL: ఎయిమ్స్‌లో జూనియర్ ఫిజియోథెరపిస్ట్ పోస్టులు
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఎయిమ్స్‌లో ఔట్‌సోర్స్ ప్రాతిపదికన జూనియర్ ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది.
దిల్లీలోని ఎయిమ్స్‌లో ఔట్‌సోర్స్ ప్రాతిపదికన జూనియర్ ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టుకి ఇంటర్ (సైన్స్), ఫిజియోథెరపీలో డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబరు 3లోగా దరఖాస్తుచేసుకాల్సి ఉంటుంది.
వివరాలు..
జూనియర్ ఫిజియోథెరపిస్ట్: 20 పోస్టులు
అర్హత: ఇంటర్ (సైన్స్), ఫిజియోథెరపీలో డిగ్రీ.
జీతం: నెలకు రూ.25,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
కేటగిరీల వారీగా రిజిస్ట్రేషన్ & అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:
🔰 జనరల్ అభ్యర్థులకు రూ.885. (అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ.590 అదనంగా చెల్లించ వలెను)
🔰 ఓబీసీ అభ్యర్థులకు రూ.885 (అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.590 అదనంగా చెల్లించ వలెను)
🔰 ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.531 (అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్టుకు రూ.354 అదనంగా చెల్లించ వలెను)
🔰 ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 885 (అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ.590 అదనంగా చెల్లించ వలెను)
🔰 మహిళా అభ్యర్థులకు రూ. 885 (అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ.590 అదనంగా చెల్లించ వలెను)
🔰 EWS/PH అభ్యర్థులకు రూ. 531 (అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ.354 అదనంగా చెల్లించ వలెను)
ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 03.12.2022.
Also Read:
ప్రకాశం జిల్లాలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్ అర్బన్ క్లినిక్/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదోతరగతి, ఎంబీబీఎస్, డీఫార్మసీ/ బీఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత దరఖాస్తులను నింపి సంబధిత ధృవ పత్రాలను జతపరిచి వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, జీజీహెచ్ కాంపౌండ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాలో అందచేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నోయిడా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా డిప్యూటీ డైరెక్టర్, EDP అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, సంబధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో స్పీడ్‌గా టైప్ చేయకలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు, 382 ఉద్యోగాల భర్తీకి జీవో జారీ
New Fire Stations: తెలంగాణలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫైర్ స్టేషన్ ల ఏర్పాటుతో పాటు అగ్నిమాపక శాఖళో ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. సిబ్బంది నియమించుకోవచ్చని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖకు సూచనలు ఇచ్చింది. ఈ మేరకు జీవో ఎం. ఎస్ నంబర్ 64 ను రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..