BECIL: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా ఉన్నాయి
BECIL Jobs: బీఈసీఐఎల్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు పిబ్రవరి 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ.590; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు రూ.295 చెల్లించాలి.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 54
పోస్టుల వారీగా ఖాళీలు..
⏩ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్(MRT): 04 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు 6 నెలల మెడికల్ రికార్డ్ టెక్నాలజీ సర్టిఫికెట్ కోర్సు కలిగి ఉండాలి.
అనుభవం: MS Word & Excel లో కనీసం 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 20 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.20,903 చెల్లిస్తారు.
⏩ ఫుడ్ బేరర్: 16 పోస్టులు
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత/మెట్రిక్యులేషన్ కలిగి ఉండాలి.
అనుభవం: క్యాటరింగ్ సంస్థ, ఫుడ్ అవుట్‌లెట్/పాక సేవ మొదలైన వాటిలో బేరర్ కమ్ వెయిటర్/యుటిలిటీ వర్కర్‌గా కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.18,993 చెల్లిస్తారు.
⏩ టెక్నాలజిస్ట్ (OT): 05 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఎస్సీ(OT టెక్నాలజీ/అనస్థీషియా టెక్నాలజీ) కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.33,580 చెల్లిస్తారు.
⏩ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్(MLT): 10 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీస్ / మెడికల్ లాబొరేటరీ సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ / బయోటెక్నాలజీ) లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో రెండు సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.40,710 చెల్లిస్తారు.
⏩ అసిస్టెంట్ డైటీషియన్: 10 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంఎస్సీ(ఫుడ్ & న్యూట్రిషన్) ఉత్తీర్ణతతో పాటు పెద్ద టీచింగ్ హాస్పిటల్‌లో రెండు సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ప్రాధాన్యంగా ఉండాలి.
జీతం: నెలకు రూ.26,000 చెల్లిస్తారు.
⏩ పేషెంట్ కేర్ కోఆర్డినేటర్(PCC): 01 పోస్టులు
అర్హత: లైఫ్ సైన్సెస్‌లో ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ (ప్రాధాన్యత) లేదా ఏదైనా రంగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు హాస్పిటల్‌లో 1 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఉద్యోగంలో చేరిన తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: నెలకు రూ.26,728 చెల్లిస్తారు.
⏩ పేషెంట్ కేర్ మేనేజ్(PCM): 04 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్, లైఫ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు హాస్పిటల్‌లో 1 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఉద్యోగంలో చేరిన తేదీ నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
⏩ ల్యాబ్ అటెండెంట్: 01 పోస్టు
అర్హత: 12వ తరగతి (సైన్స్) ఉత్తీర్ణతతో పాటు ల్యాబ్ అటెండెంట్‌గా ల్యాబ్‌లో 02 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.24,648 చెల్లిస్తారు.
⏩ డెంటల్ టెక్నీషియన్: 03 పోస్టులు
అర్హత: 12వ తరగతి (సైన్స్) ఉత్తీర్ణత, 2 సంవత్సరాల డెంటల్ డిప్లొమాతో పాటు డెంటల్ టెక్నీషియన్‌గా 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.21,970 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ.590; ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్థులకు రూ.295.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు జతచేయాల్సిన డాక్యుమెంట్స్..
➥ ఎడ్యుకేషనల్ / ప్రొఫెషనల్ సర్టిఫికెట్‌లు.
➥ 10వ తరగతి/బర్త్ సర్టిఫికెట్.
➥ కాస్ట్ సర్టిఫికెట్(వర్తిస్తే).
➥ వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్(వర్తిస్తే).
➥ పాన్ కార్డ్ కాపీ.
➥ ఆధార్ కార్డు కాపీ.
➥ ఈపీఎఫ్/ఈఎస్‌ఐసీ కార్డ్ కాపీ (వర్తిస్తే).
ఎంపిక విధానం: పరీక్ష/ డాక్యుమెంట్ వెరిఫికేషన్/ పర్సనల్ ఇంటరాక్షన్ ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
“Broadcast Engineering Consultants India Limited (BECIL),
BECIL BHAWAN,
C-56/A-17, Sector-62,
Noida-201307 (U.P).
ముఖ్యమైన తేదీలు..
🔰 నోటిఫికేషన్ వెల్లడి: 30.01.2025
🔰 దరఖాస్తుకు చివరి తేదీ: 12.02.2025.
Notification
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

