IBPS: ఐబీపీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారా? అయితే 'సిబిల్' స్కోర్ తప్పనిసరి, 'ఎన్‌వోసీ' సమర్పించాల్సిందే!
ఐబీపీఎస్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మంచి క్రెడిట్ హిస్టరీ ఉంచాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థుల సిబిల్ స్కోర్ కనీసం 650 లేదా ఆ పైన కలిగి ఉండాలని తెలిపింది.
ప్రభుత్వ బ్యాంకుల్లో పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) ఇటీవల నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ బ్యాంకుల్లో 3049 పీవో పోస్టులను, 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. ఆగస్టు 21 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మంచి క్రెడిట్ హిస్టరీ ఉంచాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థుల సిబిల్ స్కోర్ కనీసం 650 లేదా ఆ పైన కలిగి ఉండాలని తెలిపింది. అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా సంబంధించి రుణం లేదన్నట్లు 'నో అబ్జెక్షన్' సర్టిఫికేట్ సమర్పించాలని పేర్కొంది. సిబిల్ స్కోర్ నమోదులో విఫలమైతే అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేయమని స్పష్టంచేసింది.
ALSO READ:
3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
1402 పోస్టులతో ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..