News
News
వీడియోలు ఆటలు
X

APPSC: గ్రూప్‌ -4 మెయిన్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-4 మెయిన్ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ ఏప్రిల్ 6న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. 

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-4 మెయిన్ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ ఏప్రిల్ 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. గ్రూప్-4 మెయిన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. 

ప్రాథమిక ఆన్సర్ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు ఏప్రిల్ 7 నుంచి 9 వరకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. పోస్ట్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్, ఫోన్, వ్యక్తిగతంగా సమర్పించడం తదితర రూపాల్లో సమర్పించే అభ్యంతరాలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్  కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 4న రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 

General Studies & Mental ability

General English and General Telugu

రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..

Also Read:

ఏప్రిల్‌ 10 నుంచి కోర్టు ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్! పోస్టులవారీగా షెడ్యూలు ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షల ఫలితాలను మార్చి 29న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. నియామక ప్రక్రియలో భాగంగా నాన్ టెక్నికల్ విభాగాల్లోని ఉద్యోగాలకు ఏప్రిల్ 10 నుంచి 24 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అభ్యర్థులకు సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్స్ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులున్నందున ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టుల నుంచి ఖాళీలను అనుసరించి నిర్ణీత సమయంలో రెండో ఎంపిక జాబితా వెలువడనుంది. తదుపరి ఖాళీలను బట్టి అవసరమైతే, మూడో ఎంపిక జాబితా కూడా ప్రకటిస్తారు. టెక్నికల్ విభాగంలోని స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
పోస్టులవారీగా షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 మెయిన్స్ పరీక్ష తేదీని యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (యూపీఎస్సీ) ఖరారు చేసింది. పరీక్షను జూన్ 5న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 25న రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుం మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును పరీక్షకు కొన్నివారాలకు ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - 69 పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 13లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 06 Apr 2023 06:42 PM (IST) Tags: APPSC Group4 Answer Key Group 4 Mains Answer Key Junior Assistant Cum Computer Assistant Mains Key APPSC JA Cum CA Answer Key

సంబంధిత కథనాలు

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్,  జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు