అన్వేషించండి

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఏపీ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(గ్రూప్ 4) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈ ప్రధాన పరీక్షను ఏప్రిల్ 4న నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్- 4 మెయిన్స్ పరీక్ష హాల్‌టికెట్లను మార్చి 27న విడుదల చేసింది. ప్రధాన పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(గ్రూప్ 4) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈ ప్రధాన పరీక్షను ఏప్రిల్ 4న నిర్వహించనున్నారు. రెండు షిఫ్టుల్లో జరిపే కంప్యూటర్ పరీక్షకు 11,574 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష జరుపనున్నారు. 

గ్రూప్-4 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ఏపీ రెవెన్యూ విభాగంలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 31న ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,11,341 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. ప్రాథమిక పరీక్షలో మొత్తం 1494 మంది అభ్యర్థులు బుక్‌లెట్ సిరీస్ సరిగా వేయకపోవడం, ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు గుర్తించడం లాంటి కారణాల వల్ల అనర్హతకు గురయ్యారు.  స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 4న ఆన్‌లైన్ విధానంలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. 

Also Read:

యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ), ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ)లో ప్రవేశాల కోసం నిర్వహించునున్న రాతపరీక్ష అడ్మిట్ కార్డుల(హాల్‌టికెట్ల)ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎన్‌డీఏ & ఎన్‌ఏ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డులు పొందవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 16న పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

సీడీఎస్-1 ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్(1)-2023 పరీక్ష అడ్మిట్‌కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సీడీఎస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టు లేదా మరే ఇతర విధానాల్లోనూ అడ్మిట్‌కార్డు పొందలేరు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 16న దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో సీడీఎస్ఈ-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. 
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!
మహేంద్రగిరిలోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిద్వారా మొత్తం 63 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్/10వ తరగతి/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ/డిప్లొమా/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget