అన్వేషించండి

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC: మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

APPSC Group 2 Notification: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రభుత్వ గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా ఎంపికలు చేపట్టనున్నారు.పోస్టులవారీగా విద్యార్హతల వివరాలు, వయోపరిమితి, జీతభత్యాల వివరాలను డిసెంబరు 21లోగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు..

* గ్రూప్-2 పోస్టులు

ఖాళీల సంఖ్య: 897

➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 331

➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566

ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..

➥ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 04 పోస్టులు
విభాగం: ఏపీ మున్సిపల్ కమిషనర్స్ సబార్డినేట్ సర్వీస్.

➥ సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్- II: 16 పోస్టులు
విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబార్డినేట్ సర్వీస్. 

➥ డిప్యూటీ తహసీల్దార్: 114 పోస్టులు
విభాగం: ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్.

➥ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 28 పోస్టులు
విభాగం: ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్.

➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 16 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్.

➥ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్

➥ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 150 పోస్టులు
విభాగం: ఏపీ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సబార్డినేట్ సర్వీస్.

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD): 218 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా): 15 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్): 15 పోస్టులు 
విభాగం: ఏపీ లెజిస్లేచర్ సబార్డినేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్): 23 పోస్టులు 
విభాగం: ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్. 

➥ సీనియర్ ఆడిటర్: 08 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సబ్ సర్వీస్.

➥ ఆడిటర్: 10 పోస్టులు
విభాగం: పే & అకౌంట్ సబార్డినేట్ సర్వీస్. 

➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1 HOD): 01 పోస్టు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్.

➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1): 12 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ (డిస్ట్రిక్ట్) సబ్ సర్వీస్

➥ సీనియర్ అకౌంటెంట్: 02 పోస్టులు
విభాగం: ఏపీ వర్క్స్ & అకౌంట్స్ సబ్ సర్వీస్. 

➥ జూనియర్ అకౌంటెంట్: 22 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్. 

➥ జూనియర్ అసిస్టెంట్: 240 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఏపీపీఎస్సీ్-32, ఎకనామిక్స్ & స్టాటిటిక్స్-06, సోషల్ వెల్ఫేర్-01, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయ్స్-13, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్-02, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చరల్ కోఆపరేషన్-07, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్-31, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్-07, కమిషనర్ ఆఫ్ లేబర్-03, డైరెక్టర్ ఆఫ్ ఏనిమల్ హస్బెండరీ-07, డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్-03, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)-08, డీజీ -ప్రిసన్స్ & కోరిలేషనల్ సర్వీసెస్-02, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్-02, డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్-02, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ-08, ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-01, పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్-19, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్-02, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్-04, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్-01, డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్-03, ఇండస్ట్రియల్ ట్రైబ్యూనల్ కమ్ లేబర్ కోర్ట్-02, ఇంజినీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్-02, డైరెక్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్-02, ఇంజినీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్-05, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్-12, డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్-01, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్-20, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్ & బి-07, ఉమెన్ డెవలప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్-02, డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ & వాటర్ ఆడిట్-01, కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్-01, కమిషనర్ ఆఫ్ ఆర్కియోలజీ అండ్ మ్యూజియమ్స్-01, ఇంజినీరింగ్ రిసెర్చ్ ల్యాబ్స్-01, ప్రివెంటివ్ మెడిసిన్-01, గవర్నమెంట్ టెక్స్ బుక్ ప్రెస్-01, కమిషనరల్ ఆఫ్ ఇండస్ట్రీస్-05, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీసెస్-02, టెక్నికల్ ఎడ్యుకేషన్-09, ఆర్‌డబ్ల్యూఎస్ & ఎస్-01. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష విధానం:

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులుముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.12.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.01.2024.

Notification

Webnote

టాప్ హెడ్ లైన్స్

IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
AP Home Guards: హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Tickets Booking: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Renault Triber టైర్లు మార్చాలనుకుంటున్నారా? కొత్త టైర్లు కొనే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!
రెనాల్ట్ ట్రైబర్‌కు ఏ సైజ్ టైర్ సరిపోతుంది? టైర్‌ సైజ్‌ పెంచితే పెర్ఫార్మెన్స్‌ తగ్గుతుందా?
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Embed widget