అన్వేషించండి

APPSC Group2 Application: ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

ఏపీలో 'గ్రూప్‌-2' పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఏపీపీఎస్సీ (APPSC) పొడిగించింది. దరఖాస్తు గడువు జనవరి 10తో ముగియనుండగా జనవరి 17 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.

APPSC Group2 Application Date Extended: ఏపీలో 'గ్రూప్‌-2' పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఏపీపీఎస్సీ (APPSC) పొడిగించింది. దరఖాస్తు గడువు జనవరి 10తో ముగియనుండగా.. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు  మరో వారంరోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ జనవరి 10న ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు జనవరి 17న అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని కమిషన్ తెలిపింది. అయితే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు గడువు ముగింపు దశలో సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని సరిచేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును మరో వారం రోజుల పాటు పొడిగించారు.

డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డు ఉన్నవారు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.80 నుంచి మినహాయింపు ఉంది.

ఆంధ్రప్రదేశ్‌‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు గడువు జనవరి 10తో ముగియాల్సి ఉండగా.. జవనరి 17 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 

గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 

APPSC Group2 Application: ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

వివరాలు..

* గ్రూప్-2 పోస్టులు

ఖాళీల సంఖ్య: 899

➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333

➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566

ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..

➥ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: 04 పోస్టులు
విభాగం: ఏపీ మున్సిపల్ కమిషనర్స్ సబార్డినేట్ సర్వీస్.

➥ సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్- II: 16 పోస్టులు
విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబార్డినేట్ సర్వీస్. 

➥ డిప్యూటీ తహసీల్దార్: 114 పోస్టులు
విభాగం: ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్.

➥ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 28 పోస్టులు
విభాగం: ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్.

➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 16 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్.

➥ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్

➥ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 152 పోస్టులు
విభాగం: ఏపీ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సబార్డినేట్ సర్వీస్.

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD): 218 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా): 15 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్): 15 పోస్టులు 
విభాగం: ఏపీ లెజిస్లేచర్ సబార్డినేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్): 23 పోస్టులు 
విభాగం: ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్. 

➥ సీనియర్ ఆడిటర్: 08 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సబ్ సర్వీస్.

➥ ఆడిటర్: 10 పోస్టులు
విభాగం: పే & అకౌంట్ సబార్డినేట్ సర్వీస్. 

➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1 HOD): 01 పోస్టు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్.

➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1): 12 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ (డిస్ట్రిక్ట్) సబ్ సర్వీస్

➥ సీనియర్ అకౌంటెంట్: 02 పోస్టులు
విభాగం: ఏపీ వర్క్స్ & అకౌంట్స్ సబ్ సర్వీస్. 

➥ జూనియర్ అకౌంటెంట్: 22 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్. 

➥ జూనియర్ అసిస్టెంట్: 240 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: ఏపీపీఎస్సీ-32, ఎకనామిక్స్ & స్టాటిటిక్స్-06, సోషల్ వెల్ఫేర్-01, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయ్స్-13, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్-02, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చరల్ కోఆపరేషన్-07, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్-31, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్-07, కమిషనర్ ఆఫ్ లేబర్-03, డైరెక్టర్ ఆఫ్ ఏనిమల్ హస్బెండరీ-07, డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్-03, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)-08, డీజీ -ప్రిసన్స్ & కోరిలేషనల్ సర్వీసెస్-02, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్-02, డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్-02, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ-08, ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-01, పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్-19, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్-02, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్-04, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్-01, డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్-03, ఇండస్ట్రియల్ ట్రైబ్యూనల్ కమ్ లేబర్ కోర్ట్-02, ఇంజినీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్-02, డైరెక్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్-02, ఇంజినీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్-05, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్-12, డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్-01, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్-20, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్ & బి-07, ఉమెన్ డెవలప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్-02, డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ & వాటర్ ఆడిట్-01, కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్-01, కమిషనర్ ఆఫ్ ఆర్కియోలజీ అండ్ మ్యూజియమ్స్-01, ఇంజినీరింగ్ రిసెర్చ్ ల్యాబ్స్-01, ప్రివెంటివ్ మెడిసిన్-01, గవర్నమెంట్ టెక్స్ బుక్ ప్రెస్-01, కమిషనరల్ ఆఫ్ ఇండస్ట్రీస్-05, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీసెస్-02, టెక్నికల్ ఎడ్యుకేషన్-09, ఆర్‌డబ్ల్యూఎస్ & ఎస్-01. 

అర్హత: డిగ్రీ, ఆపై విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డు ఉన్నవారు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.80 నుంచి మినహాయింపు ఉంది. 

గ్రూప్-2 పోస్టుల అర్హతలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

Online Application

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Kickboxing: తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Embed widget