(Source: ECI/ABP News/ABP Majha)
APPSC: గ్రూప్-1కు ఎంపికైనవారిలో 33 మంది మహిళలు, ఒకే ఇంట్లో అన్నదమ్ములిద్దరికీ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 17న తుది ఎంపిక ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 111 ఉద్యోగాలకుగాను 110 మందిని ఉద్యోగాలకు ఎంపికచేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 17న తుది ఎంపిక ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 111 ఉద్యోగాలకుగాను 110 మందిని ఉద్యోగాలకు ఎంపికచేసింది. ఉద్యోగాలకు ఎంపికైనవారిలో 33 మంది మహిళలే ఉన్నారు. 111 ఉద్యోగాల్లో ఒక పోస్టును స్పోర్ట్స్ కోటాలో భర్తీపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రిలిమ్స్ ద్వారా 1:50 నిష్పత్తిలో 6,455 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేశారు. రాత పరీక్షల అనంతరం ఎంపిక చేసిన 222 మందికి గతనెలలో మౌఖిక పరీక్షలు నిర్వహించారు. మూడు బోర్డుల ద్వారా జరిగిన మౌఖిక పరీక్షలకు హాజరైన వారిలో ఐఐఎం, ఐఐటీ, బిట్స్, నిట్, ట్రిపుల్ ఐటీల్లో చదివిన వారు 35 మంది, వైద్యులు 13 మంది ఉన్నారు. రాష్ట్ర పోస్టులకు 14 మంది మహిళలు ఎంపికయ్యారు.
గ్రూప్-1 తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
గ్రూప్-1 పోస్టులకు సంబంధించి పోస్టులవారీగా ఎంపికైన అభ్యర్థులు..
➥ డిప్యూటీ కలెక్టర్: 13
➥ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్(ఏపీ): 13
➥ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ-సివిల్): 13
➥ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(మెన్): 02
➥ డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ (రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీస్): 02
➥ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 11
➥ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్: 02
➥ మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 16
➥ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ (ఏపీ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ సర్వీస్): 03
➥ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్: 01
➥ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 03
➥ మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2): 06
➥ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ లే సెక్రటరీ & ట్రెజరర్ (గ్రేడ్-2): 17
➥ డిప్యూటీ రిజిస్ట్రార్: 01
➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 06
➥ అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్: 01
ప్రత్యూష మొదటి ర్యాంకు..
గ్రూప్-1 తుది ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన భాను శ్రీలక్షీ అన్నపూర్ణ ప్రత్యూష గ్రూపు-1 పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటారు. ఆమె తండ్రి వెంకట రామాంజనేయులు భీమవరం డీఈవో కార్యాలయంలో ఏపీవోగా పని చేస్తున్నారు. తల్లి ఉష గృహిణి. వీరికి ప్రత్యూష ఒక్కరే సంతానం. ఈమె ఇంటర్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఢిల్లీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనమిక్స్‌లో డిగ్రీ చేశారు. ప్రస్తుతం సివిల్స్ మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఏపీపీఎస్సీ గ్రూపు-1లో తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు రావడం ఆనందంగా ఉందని భాను శ్రీలక్షీ అన్నపూర్ణ ప్రత్యూష అన్నారు.
భూమిరెడ్డి పావని రెండో ర్యాంకు..
గ్రూప్-1 ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన రైతుబిడ్డ భూమిరెడ్డి పావని గ్రూప్-1లో రెండో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. బీటెక్ ఈసీఈ పూర్తి చేసిన ఆమె కర్నూలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తమ బిడ్డ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికవ్వడంపై ఆమె తల్లిదండ్రులు లక్ష్మీదేవి, గంగయ్య, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
లక్ష్మీప్రసన్నకు మూడోర్యాంకు..
గ్రూప్-1 తుది ఎంపిక ఫలితాల్లో అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న గ్రూప్-1 ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం పొందారు. సుబ్బరాయుడు, సరస్వతి దంపతుల మూడో కుమార్తె ఈమె. తండ్రి రాజంపేట ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. లక్ష్మీ ప్రసన్న గతంలో మూడుసార్లు సివిల్స్‌కు ప్రయత్నించారు. 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం పొంది టంగుటూరులోపనిచేస్తున్నారు. ఈమె ఇద్దరు సోదరీమణులు గ్రూప్-1 ఉద్యోగులే కావడం విశేషం.
ప్రవీణ్ కుమార్ రెడ్డికి నాలుగో ర్యాంకు..
గ్రూప్-1 ఫలితాల్లో వైయస్‌ఆర్ జిల్లా మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన కుప్పిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి గ్రూప్-1 ఫలితాల్లో నాలుగో ర్యాంకు సాధించారు. ఆయన ప్రస్తుతం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. 2014, 2015 సివిల్స్ రాసినా మెయిన్స్‌లో అర్హత సాధించలేకపోయారు. 2018లో గ్రూప్-2లో 11వ ర్యాంకు సాధించి సహాయ లేబర్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. తల్లిదండ్రులు కేసీ వెంకటరెడ్డి, కె.రామసుబ్బమ్మ. తండ్రి ప్రొద్దుటూరులోని డీసీసీబీలో సూపర్ వైజర్‌గా ఉద్యోగ విరమణ చేశారు.
ఒకే ఇంట్లో ఇద్దరికి గ్రూప్-1 ఉద్యోగాలు
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ సంక్షేమశాఖలో పని చేసి రిటైరైన పోలుమహంతి ఉమామహేశ్వరరావు ఇద్దరు కుమారులు గ్రూప్-1 ఫలితాల్లో ఒకేసారి సత్తా చాటారు. పెద్ద కుమారుడు పి.వెంకట సాయిరాజేష్ అగ్నిమాపక అధికారిగా, చిన్న కుమారుడు పి.వెంకట సాయిమనోజ్ వైద్యారోగ్యశాఖలో పరిపాలనాధికారిగా ఉద్యోగాలు సాధించారు. ఇద్దరూ బీటెక్ పూర్తి చేశారు. ఏడేళ్ల నుంచి దిల్లీలో సివిల్స్ శిక్షణ పొందుతున్నారు. తల్లి సాయి సుజాత స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.