Answer Key Objections: అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆన్సర్ కీ అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం!
న్సర్ కీపై అభ్యంతరాలకు నవంబరు 17 నుంచి 19 వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఏమైనా అభ్యంతరాలుంటే తెలపవచ్చు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు స్వీకరిస్తారు.
ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఉద్యోగాల భర్తీకి నవంబరు 9 నుంచి 11 వరకు నియామక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నవంబరు 16న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది.
ఆన్సర్ కీపై అభ్యంతరాలకు నవంబరు 17 నుంచి 19 వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఏమైనా అభ్యంతరాలుంటే తెలపవచ్చు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాట్సాప్, SMS, ఫోన్, ప్రత్యక్షంగా లేదా మరే ఇతర విధానాల్లో అభ్యంతరాలను స్వీకరించరని గమనించాలి. గడువులోగా నమోదుచేసిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు.
అభ్యంతరాల నమోదుకోసం క్లిక్ చేయండి..
ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి మే వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థులకు నవంబరు 9 నుంచి 11 వరకు నియామక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ తాజాగా వెల్లడించింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా కమిషన్ వెల్లడించనుంది.
Also Read:
సివిల్ అసిస్టెంట్ సర్జన్ దరఖాస్తు సవరణకు అవకాశం, తప్పులుంటే మార్చుకోండి!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబరు 27 నుంచి నవంబరు 16 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తికావడంతో అభ్యర్థి వివరాల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోడానికి ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. నవంబరు 17 నుంచి 19 వరకు దరఖాస్తు వివరాలను మార్చుకోవచ్చు.
దరఖాస్తుల సవరణ, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
'గ్రూప్-1'లో 5 ప్రశ్నల తొలగింపు, మార్కుల కేటాయింపు ఇలా!
తెలంగాణ తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించినన ఫైనల్ ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ నవంబరు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలన తర్వాత ఫైనల్ కీని టీఎస్‌పీస్సీ విడుదల చేసింది. అభ్యంతరాలు నమోదుచేసిన అభ్యర్థులు ఫైనల్ కీ సరిచూసుకోవచ్చు.'గ్రూప్-1' ప్రిలిమినరీ కీపై అభ్యర్థుల నుంచి పలు అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సబ్జెక్టు నిపుణుల కమిటీలకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ కమిటీ అభ్యంతరాలను క్షుణ్నంగా పరిశీలించి.. 5 ప్రశ్నలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో రెండు ప్రశ్నలకు రెండు కంటే ఎక్కువ సమాధానాలు సరైనవిగా ప్రకటించింది.
గ్రూప్-1 ఫైనల్ కీ, మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..