అన్వేషించండి

AP Police SI Application: ఎస్‌ఐ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ఏపీలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి డిసెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా... జనవరి 18న సాయంత్రం 5 గంటల కల్లా దరఖాస్తు గడువు ముగియనుంది. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

ఏపీలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల పరిధిలో 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్ పాసై, డిగ్రీ చదువుతూ ఉండాలి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా... జనవరి 18న సాయంత్రం 5 గంటల కల్లా దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

పోస్టుల వివరాలు..

* సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు 

ఖాళీల సంఖ్య: 411

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) ఎస్‌ఐ- సివిల్ (మెన్/ఉమెన్): 315 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జోన్ జిల్లా/ఏరియా పోస్టులు
జోన్-1 (విశాఖపట్నం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 50
జోన్-2 (ఏలూరు) తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 105
జోన్-3 (గుంటూరు) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 55
జోన్-4 (కర్నూలు) చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప 105
  మొత్తం  315

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 96 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  24
రాజమహేంద్రవరం 24
మద్దిపాడు - ప్రకాశం  24
చిత్తూరు 24
మొత్తం 96

 

Also Read: కానిస్టేబుల్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

అర్హత: ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్ పాసై, డిగ్రీ చదువుతూ ఉండాలి.
 
వయోపరిమితి:

🔰 01.07.2022 నాటికి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1995 - 01.07.2001 మధ్య జన్మించి ఉండాలి.

🔰 నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ ద్వారా.

🔰 ప్రిలిమినరీ పరీక్ష విధానం:

➨ ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

➨ పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.

➨ ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుంది.

➨ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.

➨ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు.

➨ అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

🔰  ఫిజికల్ ఈవెంట్లు ఇలా..

➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.12.2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.01.2022.

➥ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్: 05.02.2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష తేది: 19.02.2023.

Notification 

Online Application

Website 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh Remand: నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
Womens World Cup Winner: దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
KTR on Hydra Demolitions: ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
Jodhpur Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
జోధ్‌పూర్‌లో లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
Advertisement

వీడియోలు

Women's ODI World Cup 2025 Winner India | టీమిండియా గెలుపులో వాళ్లిద్దరే హీరోలు | ABP Desam
World Cup 2025 Winner India | విశ్వవిజేత భారత్.. ప్రపంచకప్ విజేతగా టీమిండియా మహిళా టీమ్ | ABP Desam
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లుకు అన్యాయం జరుగుతోందా.. వాస్తవాలేంటి..!?
బాదుడే బాదుడు.. అమ్మాయిలూ మీరు సూపర్!
India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jogi Ramesh Remand: నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
Womens World Cup Winner: దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
KTR on Hydra Demolitions: ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
Jodhpur Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
జోధ్‌పూర్‌లో లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Rashmika Mandanna: శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Embed widget