AP Recruitment: నంద్యాలలో అంగన్‌వాడీ ఉద్యోగాలు,అర్హతలివే!
నంద్యాల, మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమం దాని పరిధిలోని ఖాళీగా వున్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ద్వారా ప్రధాన అంగన్‌వాడీ వర్కర్, మినీ వర్కర్, అంగన్‌వాడీ ఆయా పోస్టులను భర్తీ చేస్తారు.
నంద్యాల, మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమం దాని పరిధిలోని 8 ఐసిడియస్ ప్రాజెక్ట్‌లలో ఖాళీగా వున్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ద్వారా ప్రధాన అంగన్‌వాడీ వర్కర్, మినీ వర్కర్, అంగన్‌వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన స్త్రీ అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైనులో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 113
ప్రధాన అంగన్‌వాడీ కార్యకర్త: 08
అర్హత: అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మినీ వర్కర్: 01
అర్హత: అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అంగన్‌వాడీ ఆయా: 104
అర్హత: అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి(01-07-2022 ) నాటికి: 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైను ద్వారా.
ఎంపిక విధానం: రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: 30.08.2022
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 08.09.2022 సాయంత్రం 05:00 వరకు
Also Read:
DRDO Recruitment: డీఆర్‌డీఓ -సెప్టంలో 1901 ఖాళీలు, అర్హతలివే!
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనేజేషన్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి(ఎస్‌టిఏ- B),టెక్నీషియన్-A (టెక్-A) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఝార్ఖండ్‌లోని బొకారో స్టీల్ ప్లాంట్‌లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..