APMDC: ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
APMDC Recruitment: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
APMDC Recruitment: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 06 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ/ డిప్లొమా (మైనింగ్/ మైన్ సర్వే) లేదా డిగ్రీ (సైన్స్), మైన్ సర్వేయర్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగినవారు దరఖాస్తు చేసుకొవడానికి అర్హులు. పరీక్ష ఫీజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీకి రూ.500. ఇతర కేటగిరీలకు రూ.1000 చెల్లించాలి. సరైన అర్హతలున్నవారు మార్చి 14వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 06
⏩ మేనేజ్‌మెంట్ ట్రైనీ (సర్వే) (మెటాలిఫరస్): 03 పోస్టులు
పోస్టుల కెటాయింపు: జనరల్(UR): 01, ఎస్సీ: 01, బీసీ(A): 01.
అర్హత: డిగ్రీ/ డిప్లొమా (మైనింగ్/ మైన్ సర్వే) లేదా డిగ్రీ (సైన్స్), మైన్ సర్వేయర్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి 18 -32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
లోకేషన్: ప్రధాన కార్యాలయం / ఏదైనా ఒకప్రాజెక్టు.
⏩ మేనేజ్‌మెంట్ ట్రైనీ (సర్వే) (కోల్): 03 పోస్టులు
పోస్టుల కెటాయింపు: జనరల్(UR): 02, ఎస్సీ: 01.
అర్హత: డిగ్రీ/ డిప్లొమా (మైనింగ్/ మైన్ సర్వే) లేదా డిగ్రీ (సైన్స్), మైన్ సర్వేయర్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి 18 -32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
లోకేషన్: ప్రధాన కార్యాలయం / ఏదైనా ఒకప్రాజెక్టు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
పే స్కేల్: రూ.40,970- రూ.1,24,380.
పరీక్ష ఫీజు: బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీకి రూ.500. ఇతర కేటగిరీలకు రూ.1000.
పరీక్ష కేంద్రం: విజయవాడ.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్ టైపులో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు అండ్ ప్రతి తప్పు సమాధానానికి అభ్యర్థి మొత్తం స్కోర్ నుండి 0.25 మార్కులు తీసివేయబడతాయి. ఆప్టిట్యూడ్ & రీజనింగ్– ~10%, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు –~20%, సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు –~70% కెటాయించారు. పరీక్ష వ్యవధి: 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. ప్రశ్నపత్రం ఆంగ్ల భాషలో ఉంటుంది.
సిలబస్:
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.02.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.03.2024.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
ALSO READ:
ఇండియన్ నేవీలో 254 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.56 వేల ప్రారంభ జీతం
Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్‌లలో 254 ఖాళీలను భర్తీచేనున్నారు. విభాగాలవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 24న ప్రారంభంకాగా, మార్చి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..