Navy Jobs: ఇండియన్ నేవీలో 254 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.56 వేల ప్రారంభ జీతం
ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్‌లలో 254 ఖాళీలను భర్తీచేనున్నారు.
Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్‌లలో 254 ఖాళీలను భర్తీచేనున్నారు. విభాగాలవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 24న ప్రారంభంకాగా, మార్చి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని 'ఇండియన్ నేవీ అకాడమీ'లో 2025, జనవరిలో ప్రారంభమయ్యే కోర్సు(ST-25)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎస్ఎల్టీ బేసిక్ పే కింద రూ.56,100 ఇస్తారు. దీంతోపాటు ఇతర అలవెన్సులూ ఉంటాయి. NCC (C సర్టిఫికేట్) అభ్యర్థులకు ఎంపికలో 5 శాతం రిలాక్సేషన్ వర్తిస్తుంది. నేవీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జనవరి 2025 (ST-25) కోర్సు
మొత్తం ఖాళీల సంఖ్య: 254.
➥ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: 136 పోస్టులు
➥ ఎడ్యుకేషన్ బ్రాంచ్: 18 పోస్టులు
➥ టెక్నికల్ బ్రాంచ్: 100 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ బ్రాంచి వివరాలు..
⫸ జనరల్ సర్వీస్: 50 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 02.01.2000 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి.
⫸ పైలట్: 20 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. డీజీసీఏ జారీచేసిన పైలట్ లైసెన్స్ కలిగి ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 02.01.2001 - 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి. పైలట్ లైసెన్స్ కలిగివారు 02.01.2000 - 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి
⫸ నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 18 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 02.01.2001 - 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి.
⫸ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 08 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 02.01.2000 - 01.01.2004 మధ్య జన్మించి ఉండాలి.
⫸ లాజిస్టిక్స్: 30 పోస్టులు
అర్హత: ప్రథమశ్రేణిలో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) బీఎస్సీ/బీకామ్/ బీఎస్సీ(ఐటీ)తోపాటు పీజీ డిప్లొమా (ఫైనాన్స్/ లాజిస్టిక్స్/ సప్లయ్ ఛైన్ మేనేజ్‌మెంట్/ మెటీరియల్ మేనేజ్‌మెంట్) అర్హత ఉండాలి. (లేదా) ప్రథమశ్రేణిలో ఎంబీఏ/ఎంసీఏ/ఎంఎస్సీ(ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 02.01.2000 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి.
⫸ నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్: 10 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. పదోతరగతి లేదా ఇంటర్ స్థాయిలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులు తగ్గకుండా ఉండాలి.
విభాగాలు: మెకానికల్/మెకానికల్ అండ్ ఆటోమేషన్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్/ మైక్రో ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ / కంట్రోల్ ఇంజినీరింగ్ / ప్రొడక్షన్ / ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ / ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ / అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఐటీ / కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజినీరింగ్ / కంప్యూటర్ అప్లికేషన్ / మెటలర్జీ / మెటలర్జికల్ / కెమికల్ / మెటీరియల్ సైన్స్ / ఏరోస్పేస్ / ఏరోనాటికల్ ఇంజినీరింగ్ (లేదా) పీజీ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్).
వయోపరిమితి: 02.01.2000 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి.
ఎడ్యుకేషన్ బ్రాంచ్ వివరాలు..
⫸ ఎడ్యుకేషన్: 18 పోస్టులు
అర్హతలు..
➥ 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) ఉత్తీర్ణత ఉండాలి. (OR)
➥ 60 శాతం మార్కులతో బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్)తోపాటు ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/ఆపరేషనల్ రిసెర్చ్/ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉండాలి. (OR)
➥ 60 శాతం మార్కులతో ఎంటెక్ (థర్మల్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్/మెషిన్ డిజైన్/కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/VLSI/ పవర్ సిస్టమ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: బీఈ/బీటెక్, ఎంఎస్సీ అర్హతలున్న అభ్యర్థులు 02.01.2000 - 01.01.2004 మధ్య, ఎంటెక్ అర్హతలున్న అభ్యర్థులు 02.01.1998 - 01.01.2004 మధ్య జన్మించి ఉండాలి.
టెక్నికల్ బ్రాంచ్ వివరాలు..
⫸ ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 30 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
విభాగాలు: మెకానికల్ విత్ ఆటోమేషన్/ మెరైన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్/ ప్రొడక్షన్/ ఏరోనాటికల్/ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ & మేనేజ్‌మెంట్ / కంట్రోల్ ఇంజినీరింగ్ / ఏరోస్పేస్/ ఆటోమొబైల్స్/ మెటలర్జి/ మెకట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్.
వయోపరిమితి: 02.01.2000 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి.
⫸ ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 50 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
విభాగాలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్/ టెలీ కమ్యూనికేషన్/ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/పవర్ ఇంజినీరింగ్/ పవర్ ఎలక్ట్రానిక్స్.
వయోపరిమితి: 02.01.2000 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి.
⫸ నావల్ కన్‌స్ట్రక్టర్: 20 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
విభాగాలు: మెకానికల్/ మెకానికల్ విత్ ఆటోమేషన్/ సివిల్/ ఏరోనాటికల్/ ఏరోస్పేస్ / మెటలర్జి/ నేవల్ ఆర్కిటెక్చర్/ ఓషన్ ఇంజినీరింగ్/ మెరైన్ ఇంజినీరింగ్ / షిప్ టెక్నాలజీ/ షిప్ బిల్డింగ్/ షిప్ డిజైన్.
వయోపరిమితి: 02.01.2000 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: క్వాలిఫయింగ్ డిగ్రీలో సాధించిన సాధారణ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకు ఎంపికైన విషయాన్ని ఈ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఖాళీల లభ్యత, సంబంధిత ప్రవేశానికి మెడికల్ క్లియరెన్స్ ఆధారంగా అన్ని ఎంట్రీలకు ఎస్ఎస్బీ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఫిట్‌గా తేలిన అభ్యర్థులను ఎంట్రీలో ఖాళీల లభ్యతను బట్టి నియమిస్తారు.
శిక్షణ వివరాలు..
➥ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సబ్-లెఫ్టినెంట్ హోదాలో వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే కోర్సుకు ప్రవేశాలు కల్పిస్తారు.
➥ అవివాహిత పురుష, స్త్రీ అభ్యర్థులను మాత్రమే శిక్షణకు ఎంపికచేస్తారు. ఒకవేళ శిక్షణ సమయంలో వివాహం జరుగుతున్నట్లు తెలిసినా, వివాహం అయినట్లు తెలిసినా.. శిక్షణ నుంచి తొలగిస్తారు. అప్పటిదాకా వారిమీద పెట్టిన ఖర్చు మొత్తాన్ని వసూలుచేస్తారు.
➥ స్వచ్ఛందంగా శిక్షణ నుంచి ప్రారంభదశలో లేదా ప్రొబేషన్ పీరియడ్‌లో వెనుదిరగాలనుకునే వారు శిక్షణ కాలానికయ్యే మొత్తం ఖర్చును కూడా చెల్లించాల్సి ఉంటుంది.
➥ ఫ్లైయిండ్ ట్రెయినింగ్‌లో(Pilot/NAOO) అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులను సర్వీసు నుంచి తొలిగిస్తారు.
ప్రారంభ వేతనం: ఎస్ఎల్టీ బేసిక్ పే కింద రూ.56,100 ఇస్తారు. దీంతోపాటు ఇతర అలవెన్సులూ ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.02.2024
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.03.2024