News
News
X

సచివాలయాల్లో 13,995 ఖాళీలు - అధికంగా ఈ విభాగంలోనే!

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల్లో అధికంగా పశుసంవర్థక శాఖలోనే కనిపిస్తున్నాయి. ఈ శాఖలో 4,765 పశుసంవర్థక సహాయకుల ఖాళీలు ఉండగా, ఆ తర్వాత విద్యుత్‌శాఖలో గ్రేడ్‌-2 ఖాళీలు 1,127 ఉన్నట్లు తేలింది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు ఏర్పాడ్డాయి. తాజాగా గుర్తించిన ప్రకారం మొత్తం 13,995 ఖాళీలున్నట్లు తేలింది. వీటిల్లో కొన్ని శాఖలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపైనా దృష్టి సర్కారు సారిస్తోంది. ఈ మేరకు అన్ని శాఖలకూ ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల్లో అధికంగా పశుసంవర్థక శాఖలోనే కనిపిస్తున్నాయి. ఈ శాఖలో 4,765 పశుసంవర్థక సహాయకుల ఖాళీలు ఉండగా, ఆ తర్వాత విద్యుత్‌శాఖలో గ్రేడ్‌-2 ఖాళీలు 1,127 ఉన్నట్లు తేలింది. ఇక హార్టికల్చర్ విభాగంలో 1496 అసిస్టెంట్ పోస్టులు, గ్రేడ్‌-3 మహిళా పోలీస్‌ పోస్టులు 1092, గ్రామ సర్వేయర్‌ సహాయకుల పోస్టులు 1027 ఖాళీగా ఉన్నాయి.

మొత్తం ఖాళీల్లో అత్యవసర పోస్టులేవి? వేటిని త్వరగా భర్తీ చేయాలి? ఎందులో తదుపరి నియామకాలు అవసరం లేదు? అన్న దానిపై ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మహిళా పోలీస్‌, గ్రామ సర్వేయర్‌ సహాయకులు, మున్సిపల్‌, పట్టణాభి వృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే వార్డు సౌకర్యాల కార్యదర్శులు, ప్లానింగ్‌, రెగ్యులేటరీ కార్యదర్శి, పారిశుద్ధ్యం, పర్యావరణం, విద్య, వార్డు పాలన, వార్డు సంక్షేమానికి సంబంధించిన కార్యదర్శుల పోస్టుల ఖాళీలను భర్తీ చేయరాదని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఖాళీలే దాదాపు 3,905 వరకు ఉన్నట్లు తేలింది. మరికొన్ని పోస్టులను స్థానిక భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 

జాబ్‌ చార్టు లేని పోస్టులు..
దాదాపు ఎనిమిది కీలక శాఖల్లో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టులకు ఇప్పటిదాకా జాబ్‌ చార్టు ఖరారు కాలేదు. ఇవి ఆయా శాఖల ఉన్నతాధికారుల వద్దనే పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని సంక్షేమం - విద్య సహాయకులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకోలేక, అంతర శాఖలతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక రాకపోవడంతో వారికి జాబ్‌ చార్టు ఖరారు చేయలేదు. వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్‌, అంగన్వాడీ పోస్టుల జాబ్‌ చార్టు అంశం ఆయా శాఖాధిపతుల వద్దనే ఇంకా పెండింగ్‌లో ఉండగా, పట్టు శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి వద్దనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:

ముంబయి పోర్ట్‌ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

HSL: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 43 ఖాళీలు, వివరాలు ఇలా!
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్ఎల్) వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో పర్మనెంట్ నియామకాల కింద మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను; తాత్కాలిక ప్రాతిపదికన డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 6 వరకు పర్మనెంట్ పోస్టులకు, ఏప్రిల్ 16 వరకు ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 11 Mar 2023 11:54 AM (IST) Tags: AP Grama Sachivalayam Recruitment AP Sachivalayam Notification 2023 AP Sachivalayam Application Form 2023 AP Grama Sachivalayam Posts Recruitment 2023 AP Grama/ward Sachivalayam Recruitment

సంబంధిత కథనాలు

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

L&T Recruitment 2023: ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!

L&T Recruitment 2023: ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో  మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

TSPSC Updates : టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులనూ ప్రశ్నించనున్న సిట్ - నోటీసులు జారీ !

TSPSC Updates :  టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులనూ ప్రశ్నించనున్న సిట్ - నోటీసులు జారీ !

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి