HSL: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 43 ఖాళీలు, వివరాలు ఇలా!
ఈ పోస్టుల భర్తీకి మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 6 వరకు పర్మనెంట్ పోస్టులకు, ఏప్రిల్ 16 వరకు ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్ఎల్) వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో పర్మనెంట్ నియామకాల కింద మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను; తాత్కాలిక ప్రాతిపదికన డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 6 వరకు పర్మనెంట్ పోస్టులకు, ఏప్రిల్ 16 వరకు ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పోస్టుల వివరాలు...
* మొత్తం ఖాళీలు: 43
1) మేనేజర్: 10
విభాగాలవారీగా ఖాళీలు: లీగల్-01, కమర్షియల్-02, టెక్నికల్-07.
2) అసిస్టెంట్ మేనేజర్: 02
విభాగం: ఫైనాన్స్.
3) డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్: 24
విభాగాలవారీగా ఖాళీలు: ప్లాంట్ మెయింటెనెన్స్-01, ఐటీ&ఈఆర్‌పీ-04, సివిల్-02, టెక్నికల్-06, హెచ్‌ఆర్/ట్రెయినింగ్/అడ్మిన్-03, సెక్యూరిటీ & ఫైర్ సర్వీస్-01, సేఫ్టీ-01, డిజైన్-04, లీగల్-02.
4) మెడికల్ ఆఫీసర్: 04
5) సీనియర్ అడ్వైజర్: 01
విభాగం: కార్పొరేట్ & బిజినెస్ డెవలప్‌మెంట్.
6) సీనియర్ కన్సల్టెంట్: 02
విభాగాలవారీగా ఖాళీలు: ఐటీ&ఈఆర్పీ-01, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్;లో గ్రాడ్యుయేషన్;/ ఇంజినీరింగ్; డిగ్రీ/ డిప్లొమా/ ఎంబీబీఎస్;/ ఎల్;ఎల్;బీ/ ఐసీఏఐ/ ఐసీడబ్ల్యూఏఐ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ/ ఎంసీఏ ఉత్తీర్ణత.
వయసు: 30-62 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.54880-రూ.1.8లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* మెడికల్; ఆఫీసర్;, డిప్యూటీ ప్రాజెక్ట్; ఆఫీసర్;(లీగల్;) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మాత్రం 23.03.2023 రోజున ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇతర అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం ఎంపిక విధానం ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: Hindustan Shipyard Limited, Visakhapatnam.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30 నుంచి ప్రారంభం.
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్;లైన్; ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.03.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది (పర్మనెంట్ పోస్టులకు): 06.04.2023 (1700 hrs)
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది (ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులకు): 16.04.2023 (1700 hrs)
* దరఖాస్తు హార్డ్ కాపీలను పోస్టు/కొరియర్ ద్వారా పంపడానికి చివరితేది (పర్మనెంట్ పోస్టులకు): 13.04.2023 (1700 hrs)
* దరఖాస్తు హార్డ్ కాపీలను పోస్టు/కొరియర్ ద్వారా పంపడానికి చివరితేది (ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులకు): 23.04.2023 (1700 hrs)
* మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (లీగల్) ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.03.2023 (1700 hrs)
* వాక్‌ఇన్ (మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (లీగల్)) తేదీ: 23.03.2023 (08.30 hrs)
Payment of Registration fee Link
Also Read:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ - 5369 సెలక్షన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వివిధ కేంద్రం ప్రభుత్వ విభాగాల్లో సెలక్షన్ పోస్టుల భర్తీకి మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 5369 సెలక్షన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 27లోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, తదితర పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
హెచ్‌ఏఎల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గెయిల్ గ్యాస్ లిమిలెడ్‌లో 120 అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
నోయిడాకు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ ఆధ్వర్యంలోని గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..