అన్వేషించండి

AP DSC Notification: ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల, 6100 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు

AP DSC Notification: ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ సోమవారం (ఫిబ్రవరి 12) విడుదలైంది. దీనిద్వారా మొత్తం 6100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

AP DSC 2024 Notification: ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ సోమవారం (ఫిబ్రవరి 12) విడుదలైంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖాళీల భర్తీకి సంబంధించి అభ్యర్థులు ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభ సమయానికి ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తామని మంత్రి వెల్లడించారు. 

ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్‌ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్‌ 8న పోస్టింగులు ఇవ్వనున్నారు. వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
ఏపీ డీఎస్సీ 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే ఫిబ్రవరి 21లోగా నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తదనంతరం ఏప్రిల్ 8న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, ఏప్రిల్ 15న ఫలితాలు వెల్లడించనున్నారు.

నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఉదయం విడత 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

వివరాలు..

* ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్

➥ ఎస్టీజీ: 2280 పోస్టులు

➥ స్కూల్ అసిస్టెంట్: 2299 పోస్టులు

➥ టీజీటీ: 1264 పోస్టులు

➥ పీజీటీ: 215 పోస్టులు

➥ ప్రిన్సిపల్: 42 పోస్టులు

ఏపీ డీఎస్సీ షెడ్యూలు ఇలా..

➥ ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్: 12.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.02.2024.

➥ ఫీజుచెల్లింపు తేదీలు: 12.02.2024 - 21.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.02.2024.

➥ ఆన్‌లైన్ మాక్‌టెస్టు అందుబాటులో: 24.02.2024.

➥ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 05.03.2024 నుంచి.

➥ ఏపీడీఎస్సీ-2024 పరీక్ష తేదీలు: 15.03.2024 నుంచి 30.03.2024 వరకు.

పరీక్ష సమయం: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (మొదటి సెషన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (రెండో సెషన్) పరీక్షలు నిర్వహిస్తారు.

➥ ఆన్సర్ కీ వెల్లడి: 31.03.2024.

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 31.03.2024 నుంచి 03.04.2024 వరకు.

➥ ఫైనల్ కీ వెల్లడి: 08.04.2024.

➥ డీఎస్సీ-2024 ఫలితాల వెల్లడి: 15.04.2024 

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India-US Trade: ట్రంప్‌ భయాలు పటాపంచలు, చివురిస్తున్న కొత్త ఆశలు - భారత్ నుంచి USకు పెరిగిన ఎగుమతులు
ట్రంప్‌ భయాలు పటాపంచలు, చివురిస్తున్న కొత్త ఆశలు - భారత్ నుంచి USకు పెరిగిన ఎగుమతులు
Thandel First Review: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
Crime News: టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం, మహిళ అకౌంట్ నుంచి లక్ష కట్! న్యాయం చేయాలంటూ వీడియో
టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం, మహిళ అకౌంట్ నుంచి లక్ష కట్! న్యాయం చేయాలంటూ వీడియో
Rythu Bharosa Amount: తెలంగాణలో ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ - నేటి నుంచి విత్ డ్రా షురూ
తెలంగాణలో ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ - నేటి నుంచి విత్ డ్రా షురూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India-US Trade: ట్రంప్‌ భయాలు పటాపంచలు, చివురిస్తున్న కొత్త ఆశలు - భారత్ నుంచి USకు పెరిగిన ఎగుమతులు
ట్రంప్‌ భయాలు పటాపంచలు, చివురిస్తున్న కొత్త ఆశలు - భారత్ నుంచి USకు పెరిగిన ఎగుమతులు
Thandel First Review: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
Crime News: టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం, మహిళ అకౌంట్ నుంచి లక్ష కట్! న్యాయం చేయాలంటూ వీడియో
టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం, మహిళ అకౌంట్ నుంచి లక్ష కట్! న్యాయం చేయాలంటూ వీడియో
Rythu Bharosa Amount: తెలంగాణలో ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ - నేటి నుంచి విత్ డ్రా షురూ
తెలంగాణలో ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ - నేటి నుంచి విత్ డ్రా షురూ
Tilak Varma Comments: గంభీర్ సలహాలు బాగా పని చేశాయ్.. టీ20ల్లో తన ప్రదర్శనపై తిలక్ వ్యాఖ్యలు
గంభీర్ సలహాలు బాగా పని చేశాయ్.. టీ20ల్లో తన ప్రదర్శనపై తిలక్ వ్యాఖ్యలు
Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
Pawan Kalyan: జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
Balakrishna Padma Bhushan Award: పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
Embed widget