అన్వేషించండి

AP DSC Application: ఏపీ డీఎస్సీ - 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

ఏపీ డీఎస్సీ-2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అర్హతపై హైకోర్టు స్టే విధించిడంతోపాటు, దరఖాస్తు ప్రక్రియలో సర్వర్ సమస్యల కారణంగా గడువును పెంచారు.

AP DSC Application: ఏపీ డీఎస్సీ-2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అర్హతపై హైకోర్టు స్టే విధించిడంతోపాటు, దరఖాస్తు ప్రక్రియలో సర్వర్ సమస్యల కారణంగా గడువును పెంచారు. మరో మూడురోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఫిబ్రవరి 25న రాత్రి 12 గంటల వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు టెట్‌కు 3,17,950 మంది, డీఎస్సీకి 3,19,176 మంది దరఖాస్తులు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. హెల్ప్‌ డెస్క్‌ సమయాలను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పొడిగించినట్లు వెల్లడించింది. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అర్హత మినహా.. డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను కొనసాగిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు 8 వారాలకు వాయిదావేసింది.  అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. 

ఏపీలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 21తో ఫీజు చెల్లింపు గడువు ముగియాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఫిబ్రవరి 25 వరకు ఫీజు చెల్లించి, దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ ఉదయం విడత 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తదనంతరం ఏప్రిల్ 8న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, ఏప్రిల్ 15న ఫలితాలు వెల్లడించనున్నారు.

ఏపీ గురుకులాల్లో 1534 ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులు - దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

ఏపీలో 4566 టీచర్ పోస్టులు - దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

27 నుంచి టెట్ పరీక్షలు..
ఏపీ టెట్‌-2024 పరీక్షలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. టెట్‌ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు, పక్కనున్న రాష్ట్రాల్లోనూ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించగా, డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే సమయంలో అలాంటి ఆప్షన్‌ ఇవ్వలేదు. కేవలం అభ్యర్థి ప్రాథమిక విద్యను అభ్యసించిన జిల్లా వివరాలు మాత్రమే అడిగారు. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉండి, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ దరఖాస్తు సమయం ముగిసిన తర్వాత పరీక్షా కేంద్రాలను ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తారా? లేక స్థానికత ఆధారంగా సొంత జిల్లాలో రాయాల్సి ఉంటుందా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read:  హైకోర్టు 'స్టే'తో ఆందోళనలో బీఈడీ అభ్యర్థులు, ఫీజు కట్టి అప్లయ్ చేసిన వారి పరిస్థితి ఏంటీ?

మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్‌ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్‌ 8న పోస్టింగులు ఇవ్వనున్నారు. వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు.

Also Read: బీఈడీ అభ్యర్థులకు షాక్, ఎస్‌జీటీ పోస్టులకు అర్హతపై హైకోర్టు స్టే, ఆదేశాలు జారీ

వివరాలు..

➥ ఎస్టీజీ: 2280 పోస్టులు

➥ స్కూల్ అసిస్టెంట్: 2299 పోస్టులు

➥ టీజీటీ: 1264 పోస్టులు

➥ పీజీటీ: 215 పోస్టులు

➥ ప్రిన్సిపల్: 42 పోస్టులు

ఏపీ డీఎస్సీ షెడ్యూలు ఇలా..

➥ ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్: 12.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 12.02.2024.

➥ ఫీజుచెల్లింపు చివరితేది: 21.02.2024. (25.02.2024. వరకు పొడిగించారు)

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.02.2024. (25.02.2024. వరకు పొడిగించారు)

➥ ఆన్‌లైన్ మాక్‌టెస్టు అందుబాటులో: 24.02.2024.

➥ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 05.03.2024 నుంచి.

➥ ఏపీడీఎస్సీ-2024 పరీక్ష తేదీలు: 15.03.2024 నుంచి 30.03.2024 వరకు.

పరీక్ష సమయం: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (మొదటి సెషన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (రెండో సెషన్) పరీక్షలు నిర్వహిస్తారు.

➥ ఆన్సర్ కీ వెల్లడి: 31.03.2024.

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 31.03.2024 నుంచి 03.04.2024 వరకు.

➥ ఫైనల్ కీ వెల్లడి: 08.04.2024.

➥ డీఎస్సీ-2024 ఫలితాల వెల్లడి: 15.04.2024 

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget