అన్వేషించండి

AP High Court: బీఈడీ అభ్యర్థులకు షాక్, ఎస్‌జీటీ పోస్టులకు అర్హతపై హైకోర్టు స్టే, ఆదేశాలు జారీ

ఏపీలో ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.

AP HighCourt: సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై ఫిబ్రవరి 20న విచారణ చేపట్టిన కోర్టు.. ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్‌పై స్టే విధిస్తూ నేడు ఆదేశాలు జారీచేసింది.

ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులా? అని ప్రశ్నించిన కోర్టు 
ఫిబ్రవరి 21న జరిగిన విచారణలో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పింది. ఒకానొక దశలో డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. హాల్‌టికెట్లు జారీచేయవద్దని వ్యాఖ్యానించింది. అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని అభ్యర్థించారు. హాల్‌టికెట్లను ఫిబ్రవరి 22 నుంచి జారీచేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణను 21కి వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇక బుధవారం (ఫిబ్రవరి 21న) విచారణ ప్రారంభంకాగానే.. స్టే విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 

విద్యాశాఖ ఫిబ్రవరి 12న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో.. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ డిగ్రీ ఉన్న వారిని అనుమతించడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా జెట్టిపాలెం గ్రామానికి చెందిన భుక్యా గోవర్ధన సాయినాయక్ మరో నలుగురు డీఈడీ అభ్యర్థులు, హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇదే విషయాన్ని సవాలుచేస్తూ అద్దంకికి చెందిన బొల్లా సురేష్ మరో వ్యాజ్యం వేశారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం విద్యాహక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్‌సీటీఈ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. ఎస్‌జీటీలు ఒకటి నుంచి అయిదో తరగతికి బోధన చేస్తారన్నారు. డీఈడీ(డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఒకటి నుంచి 5వ తరగతి వరకూ బోధించడం సబబు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అందుకు భిన్నంగా రాష్ట్రప్రభుత్వం ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తోందన్నారు. ప్రక్రియను నిలువరించాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విద్యావిధానంలో మార్పులు తెచ్చామన్నారు. మూడు నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్య పరిధిలోకి తెచ్చామన్నారు. ఈ నేపథ్యంలో బోధనకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులిద్దరూ అవసరమన్నారు. టీచర్లుగా ఎంపికైన వారికి అప్రెంటీస్ కింద రెండేళ్లు శిక్షణ ఉంటుందన్నారు. దీంతో ఎస్‌జీటీలు.. ఉన్నత పాఠశాల విద్యార్థులకు, బీఈడీలు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధించడం సాధ్యం అవుతుందన్నారు. మరోవైపు ఎంపికైన టీచర్లు ఎన్‌సీటీఈ నిర్వహించే ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు.

ఒక వైపు శిక్షణ, మరోవైపు బోధన ఏవిధంగా సాధ్యం: ధర్మాసనం
ధర్మాసనం స్పందిస్తూ.. టీచర్లుగా ఎంపిక ప్రక్రియ ముగిశాక వారికి శిక్షణ ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని అంగీకరించలేమని పేర్కొంది. ఒక వైపు శిక్షణ, మరోవైపు పిల్లలకు బోధన ఏవిధంగా సాధ్యమని ప్రశ్నించింది. నోటిఫికేషన్‌పై స్టే ఇస్తామని, హాల్‌టికెట్లు జారీచేయవద్దని వ్యాఖ్యానించింది. ఏజీ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి మరింత సమాచారం తెలుసుకొని వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. సమయం కావాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధనను సైతం సుప్రీంకోర్టు గతంలో కొట్టేసిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచి కోర్టును తప్పుదోవపట్టిస్తోందన్నారు. ఏజీ అభ్యర్థన మేరకు విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దీనికి సంబంధించి బుధవారం స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

టాప్ హెడ్ లైన్స్

Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Embed widget