AHA AnswerKey: ఏహెచ్‌ఏ రాత పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం
AHA Answer Key: ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (Animal Husbandry Assistant ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదలైంది.

AHA Answer Key: ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (Animal Husbandry Assistant ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో క్వశ్చన్ పేపర్‌తోపాటు ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ జవాబులు సరిచూసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ 'కీ'పై ఏమైనా అభ్యంతరాలుంటే (AHA Answer Key Objections) ఆన్‌లైన్ ద్వారా జనవరి 3న రాత్రి 11 గంటల్లోగా తెలియజేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని త్వరలోనే ఫలితాలతో పాటు తుది కీ వెల్లడించనున్నారు. డిసెంబర్ 31న ఏహెచ్‌ఏ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఏపీ పశుసంవర్ధక శాఖలో ఏనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో మొత్తం 1896 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా (Polytechnic), ఇంటర్ ఒకేషనల్ (Inter Vocational) కోర్సు, బీటెక్ (BTech), బీఎస్సీ (BSc), ఎంఎస్సీ(MSc) అర్హత ఉన్నవారినుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టుల భర్తీకి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అభ్యర్థులకు డిసెంబరు 31న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్ 27న విడుదల చేశారు. డిసెంబరు 31న రాతపరీక్ష నిర్వహించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, గోపాలమిత్ర/ గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజీ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.22,460- రూ.72,810 వేతనం ఉంటుంది. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు.
ఏహెచ్‌ఏ రాత పరీక్ష క్వశ్చన్ పేపర్, ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
అభ్యంతరాల నమోదుకు క్లిక్ చేయండి..
వివరాలు..
* యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ (AHA) పోస్టులు
ఖాళీల సంఖ్య: 1896.
జిల్లాలవారీగా ఖాళీలు..
➥ అనంతపురం: 473 పోస్టులు
➥ చిత్తూరు జిల్లా: 100 పోస్టులు
➥ కర్నూలు జిల్లా: 252 పోస్టులు
➥ వైఎస్‌ఆర్ కడప: 210 పోస్టులు
➥ నెల్లూరు జిల్లా: 143 పోస్టులు
➥ ప్రకాశం జిల్లా: 177 పోస్టులు
➥ గుంటూరు జిల్లా: 229 పోస్టులు
➥ కృష్ణా జిల్లా: 120 పోస్టులు
➥ పశ్చిమ గోదావరి జిల్లా: 102 పోస్టులు
➥ తూర్పు గోదావరి జిల్లా: 15 పోస్టులు
➥ విశాఖపట్నం జిల్లా: 28 పోస్టులు
➥ విజయనగరం జిల్లా: 13 పోస్టులు
➥ శ్రీకాకుళం జిల్లా: 34 పోస్టులు
అర్హతలు..
➤ యానిమల్ హజ్బెండరీ విభాగంలో రెండేళ్ల పాలిటెక్నిక్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ ఇంటర్ ఒకేషనల్ (డెయిర్, పౌల్ట్రీ సైన్సెస్)/ రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు / ఇంటర్ వొకేషనల్ (మల్టీ పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్) కోర్సు చేసి ఉండాలి. (లేదా)
➤ ఇంటర్ వొకేషనల్ (డెయిరీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ ఓపెన్ ఇంటర్ (డెయిరీ పార్మింగ్ ఒక వొకేషనల్ సబ్జెక్టుతో) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ బీఎస్సీ (డెయిరీ సైన్స్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ బీఎస్సీలో డెయిరీ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. (లేదా)
➤ ఎంఎస్సీ(డెయిరీ సైన్స్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ నుంచి డిప్లొమా (వెటర్నరీ సైన్స్) ఉండాలి. (లేదా)
➤ బీటెక్ (డెయిరీ టెక్నాలజీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి డిప్లొమా (డెయిరీ ప్రాసెసింగ్) ఉండాలి. (లేదా)
➤ భారత్ సేవక్ సమాజ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి డిప్లామా(వెటర్నరీ సైన్స్) ఉండాలి. (లేదా)
➤ బి.వొకేషనల్ (డెయిరింగ్ & ఏనిమల్ హస్బెండరీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

