By: ABP Desam | Updated at : 25 Feb 2023 09:41 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో(EWS) ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల్లో దరఖాస్తు చేసుకోవడానికి వారికి వయసులో సడలింపు ఇస్తూ ఊరట కల్పించింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాజీ సైనికులకు మాత్రమే ఉన్న ఈ వెసులుబాటు ఇప్పుడు EWS అభ్యర్థులకు కూడా వర్తించనుంది.
ప్రభుత్వం ఉద్యోగమంటేనే చాలా ఏళ్ల శ్రమ. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియని పరిస్థితి. అందుకే నోటిఫికేషన్ వచ్చే వరకు పోరాడుతూనే ఉండాలి. నెలలు గడిచే కొద్ది చాలా మంది పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. చదివే సత్తా ఉన్నా.. పోటీని తట్టుకునే శక్తి ఉన్నప్పటికీ ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయసు మించిపోవడంతో వాళ్లంతా వేర్వేరు పనులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, సైనిక ఉద్యోగ అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వయసు సడలింపు ఇస్తున్నాయి. వారి వారి కేటగిరిని బట్టి వయసు సడలింపు ఉంటుంది. అప్పటి వరకు వాళ్లు పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి సడలింపు లేని కారణంగా ఎలాంటి రిజర్వేషన్ లేని కేటగిరి అభ్యర్థులు నష్టపోతున్నారు. వారికి పోటీని తట్టుకొని ముందుకెళ్లే శక్తి ఉన్నప్పటికీ... వయసు కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఆర్థికంగా స్థితిమంతులైన వారు వేర్వేరు వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. అయితే ఆర్థికంగా వెనకుబడిన వాళ్లు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎలాంటి రిజర్వేషన్లు వర్తించకుండా ఆర్థికంగా వెనుకబడి ఉన్న అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ సరికొత్త జీవో తీసుకొచ్చింది. EWSలో ఉద్యోగార్థులకు ఐదేళ్ల సడలింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా రిలీజ్ చేసింది. అటే ఇప్పుడు బీసీ,ఎస్సీ,ఎస్టీ తరహాలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్తఉలకు ఐదేళ్ల పెంపు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగార్థులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగాల కోసం 39 ఏళ్ల వరకు పోటీ పడవచ్చు. ఈ మరేకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. దీని వల్ల లక్షల మంది అభ్యర్థులకు ఉపశమనం లభించనుంది.
TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా? నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?
IB Answer Key: ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారం, రంగంలోకి ఈడీ? పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిందన్న అనుమానం!
TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!
SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?