AIIMS: ఎయిమ్స్-మంగళగిరిలో 125 టీచింగ్ పోస్టులు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా
AIIMS: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ (గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు.
AIIMS Mangalagiri Notification: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ (గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
* టీచింగ్ పోస్టులు (గ్రూప్-ఎ)..
మొత్తం ఖాళీలు: 125
➥ ప్రొఫెసర్: 20 పోస్టులు
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్: 73 పోస్టులు
➥ అడిషనల్ ప్రొఫెసర్: 10 పోస్టులు
➥ అసోసియేట్ ప్రొఫెసర్: 22 పోస్టులు
విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సైకియాట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్/ డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ ఖాళీలకు 58 సంవత్సరాలు; ఇతర పోస్టులకు 50 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.3,100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.2,100 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: స్టాండింగ్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ కొనసాగుతుంది.
జీతభత్యాలు..
దరఖాస్తులు పంపాల్పిన చిరునామా:
Faculty In-charge,
Recruitment Cell,
Room No: 216, 2nd Floor,
Library & Admin Building,
AIIMS, Mangalagiri, Guntur,
Andhra Pradesh, Pin – 522503.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 29.01.2024.
➥ దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 08.02.2024.
ALSO READ:
ఈసీఐఎల్ హైదరాబాద్‌లో 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిస్‌షిప్‌తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం ఖాళీల్లో ఎస్సీ- 176, ఎస్టీ- 77, ఓబీసీ- 296, యూఆర్- 440, ఈడబ్ల్యూఎస్- 111 పోస్టులు కేటాయించారు. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..