అన్వేషించండి

AIESL Jobs: ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో 74 పోస్టులు, ఈ అర్హతలుండాలి

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌ లిమిటెడ్‌(AIESL)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ - సపోర్ట్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

AIESL Recruitment: ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌ లిమిటెడ్‌(AIESL)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ - సపోర్ట్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు  సంబంధిత ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ గేట్ స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 15 వరకు పోస్ట్/ స్పీడ్ పోస్ట్/ కొరియర్ ద్వారా సంబంధిత చిరునామాకు దరఖాస్తులు సమర్పించాలి.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 74

* గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు

స్థానాలు: ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, నాగ్‌పూర్ మరియు తిరువనంతపురం.

ఏఐఈఎస్‌ఎల్‌ ఇంజినీరింగ్ యాక్టివిటీ సెంటర్లవారీగా ఖాళీలు: ఢిల్లీ- 24, ముంబయి- 22, కోల్‌కతా- 03, హైదరాబాద్- 03, నాగ్‌పుర్- 07, తిరువనంతపురం- 15.

అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటికల్/ మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఇండస్ట్రియల్/ ప్రొడక్షన్/కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ గేట్ పర్సన్టైల్ 80% & అంతకంటే ఎక్కువ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 75% & అంతకంటే ఎక్కువ కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి జనరల్ కేటగిరీకి అభ్యర్థులకు 28 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 31 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించరాదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1,500. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: అప్లికేషన్ ఫార్మాట్‌ను ప్రింట్ తీసి, స్వయంగా పూరించిన దరఖాస్తును పోస్ట్/ స్పీడ్ పోస్ట్/ కొరియర్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపాలి. అది తప్పనిసరిగా ‘Application for the post of Graduate Engineer Trainee- Support Services’ అని AIESL వెబ్‌సైట్‌లో అందించిన Google ఫారమ్‌ల లింక్ ద్వారా మీ సమాచారాన్ని పూర్తి చేసి సమర్పించాలి.

చిరునామా: 
To,
 Chief Human Resource Officer
 AI Engineering Services Limited
 Personnel Department,
 2nd Floor, CRA Building,
 Safdarjung Airport Complex,
 Aurobindo Marg, New Delhi – 110003. 

ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ & ప్రీ-ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, షార్ట్ లిస్టెడ్ మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 

స్టైఫండ్: మొదటి సంవత్సరం శిక్షణ కాలంలో రూ.40,000, ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజినీర్‌గా గ్రేడ్ చేయబడతారు. శిక్షణ మరియు పనితీరు అంచనా/స్థాయి పరీక్ష మొదలైనవాటిని పూర్తి చేసిన తర్వాత నాలుగు సంవత్సరాల వ్యవధిలో (శిక్షణ కాలం మినహా) రూ.59,000 నుంచి రూ.79,000 చెల్లిస్తారు.

సర్వీస్ బాండ్: ఎంపికైన అభ్యర్థులు శిక్షణను పూర్తి చేయడానికి మరియు కంపెనీకి కనీసం 5 సంవత్సరాల పాటు సేవ చేయడానికి బాండ్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ఇంజినీర్‌గా నియమితులైన తర్వాత, 5 సంవత్సరాల బాండ్ వ్యవధి పూర్తయ్యేలోపు అతను/ఆమె నిష్క్రమించిన సందర్భంలో బాండ్ గ్యారెంటీ  3 లక్షలు కంపెనీకి తిరిగి చెల్లించాలి. 

కాంట్రాక్ట్ కాలం: AIESL ఉద్యోగుల పనితీరు మరియు ఆవశ్యకత ఆధారంగా తదుపరి కాలానికి పొడిగించబడే 5 సంవత్సరాల కాలానికి (శిక్షణా కాలంతో సహా) స్థిర కాల ఒప్పందం, అభ్యర్థులు ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ (AIESL యొక్క FTE స్కీమ్) ప్రకారం సంస్థలో కొనసాగుతారు.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 15.01.2024. 

దరఖాస్తుతోపాటు జతచేయాల్సిన డాక్యుమెంట్లు..

➥ పదోతరగతి, గ్రాడ్యుయేషన్ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు

➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి పాసింగ్ సర్టిఫికేట్

➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (SC/ST/OBC అభ్యర్థులకు)

➥ ఓబీసీ అభ్యర్థులైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్

➥ ప్రభుత్వ ఉద్యోగులైతే సంబంధిత సంస్థ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవాలి.

Notification & Application

Google form link for Appplication Form

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Embed widget