Water: కాఫీ, టీలు తాగే ముందు మంచి నీళ్లు తాగవచ్చా? తాగితే ఏమవుతుంది?
కాఫీ, టీలు తాగే వాళ్లుకి ఎప్పుడూ మనసులో ఓ సందేహం ఉంటుంది. వీటిని తీసుకునే ముందు మంచి నీళ్లు తాగొచ్చా లేదా అని? మరి, దీనిపై వారు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ, టీలు తాగే ముందు మంచి నీళ్లు తాగొచ్చా? లేదా? అని చాలా మందికి ఉన్న సందేహం. మరి, ఈ సందేహానికి వైద్యులు ఏమని బదులిస్తున్నారో తెలుసుకుందాం. అంతేకాదు కాఫీ, టీ తాగే ముందు అసలు మంచి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో కూడా ఇప్పుడు చూద్దాం.
మనలో చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తీసుకుని రోజును ప్రారంభిస్తాం. దీనివల్ల మెదడు చురుగ్గా పని చేస్తుందనేది కొంతమంది నమ్మకం. కొంతమంది కాఫీ, టీలు ఎక్కువ తీసుకుంటే మంచిదంటారు. మరికొంతమంది ఎక్కువ తీసుకుంటే ప్రమాదం అంటారు. అలాగే నీళ్లు తాగిన తర్వాత కాఫీ లేదా టీ తాగాలని కొందరు... కాఫీ లేదా టీ తాగాలనుకును ముందు నీళ్లు తాగాలని మరికొందరు అంటుంటారు.
Also Read: ఏసీల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే ఎంత నష్టమో తెలుసుకోండి
సాధారణంగా కాఫీ లేదా టీ మన శరీరాన్ని చురుగ్గా పనిచేయడానికి దోహదపడతాయి. అయితే ఇందులో ఉండే కెఫిన్ మన గుండె పని తీరును మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అందుకే ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు కాఫీ తాగితే మన శరీరం ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అలాగని ఎక్కువ మొత్తంలో ఈ కాఫీ తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన పరిమాణంలో మాత్రమే కాఫీ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
కాఫీ లేదా టీ తాగే ముందు ఒక గ్లాసు నీటిని తాగటం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగినప్పుడు మన జీర్ణాశయం పై ఉండే పొర దెబ్బ తినే అవకాశం ఉంది. కాబట్టి వేడి వేడిగా కాఫీ, టీ తాగే ముందు ఒక గ్లాస్ నీటిని తాగటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు కాఫీ లేదా టీ తాగిన తర్వాత కొంతసేపటికి నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించడం వల్ల దంతాలపై పేరుకుపోయిన కెఫిన్ అనే పదార్థం బయటకు వెళ్లిపోతుంది. దీని వల్ల పళ్లు గార పట్టకుండా ఉంటాయి.
టీ PH విలువ 6. కాఫీ PHవిలువ 5. నీరు PH విలువ 7. టీ, కాఫీలు యాసిడ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని తాగినప్పుడు జీర్ణాశయం గోడలపై యాసిడ్ ప్రభావం పడుతుంది. ఇది జీర్ణాశయంపై నష్టం కలిగిస్తుంది. అందుకే టీ, కాఫీ తాగే ముందు నీరు తాగడం వల్ల జీర్ణాశయంలోకి కాఫీ, టీ చేరినా ఆమ్ల స్వభావం ఉండదు. పీహెచ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి.
Also Read: రాత్రి పడుకునే ముందు వీటిని అస్సలు తీసుకోకండి... మంచి నిద్ర కోసం ఏం చేయాలి?
టీ, కాఫీ మాత్రమే కాదు, అధిక PH విలువ కలిగిన ఏ పదార్థాలు తీసుకునే ముందైనా నీరు తాగకపోతే గుండెల్లో మంట, జీర్ణాశయ గోడలు దెబ్బ తినడం, పెద్ద పేగు క్యాన్సర్ వంటివి వస్తాయి. కనుక యాసిడ్ స్వభావాన్ని కలిగి ఉండే పదార్థాలను తీసుకునే ముందు కచ్చితంగా నీటిని తాగాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.