అన్వేషించండి

Sleeping Position For Better Rest: దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఒక కాలు బయట పెట్టే ఉంచాలనే విషయం తెలుసా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటీ?

కాలంతో సంబంధం లేకుండా చాలా మంది దుప్పటి కప్పుకొని నిద్రపోతారు. మరికొందరు చలికాలంలో కప్పుకుంటారు. అయితే దుప్పటి కప్పుకునేటప్పుడు ఒక కాలు కచ్చితంగా బయట పెట్టాలని సైన్స్ చెబుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Sleeping Position For Better Rest: ఆధునిక జీవనశైలి వేగంగా మారుతున్న కొద్దీ, మనకు అత్యంత అవసరమైన ఒక ప్రాథమిక అంశం కనుమరుగైపోతోంది. అదే – ప్రశాంతమైన, గాఢమైన నిద్ర. అలసిపోయి పడుకున్నప్పటికీ, ఒత్తిడి కారణంగా లేదా సరైన నిద్ర భంగిమ తెలియకపోవడం వల్ల చాలా మంది ప్రజలు ప్రశాంతమైన నిద్రను పొందలేకపోతున్నారు. రోజువారీ జీవితంలో విజయం సాధించాలంటే, నిద్రలో శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడం తప్పనిసరి. మనం ధరించే దుస్తులు, తినే ఆహారం వంటి వాటి గురించి శ్రద్ధ వహించినంతగా, మనం నిద్రించే విధానం, దాని వెనుక ఉన్న సైన్స్ గురించి పట్టించుకోము.

నిపుణుల పరిశోధన ప్రకారం, మనం మంచం మీద పడుకున్నప్పుడు, మన శరీరం దాదాపు ఆటోమేటిక్‌గా, దానికి అవసరమైన ఒక ప్రత్యేక యాంగిల్‌ను తీసుకుంటుంది. ఇది కేవలం అలవాటు కాదు; మన శరీరం సహజమైన నేచర్‌ అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సహజ ప్రతిస్పందనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే? చాలా మంది నిద్రపోయేటప్పుడు తమ శరీరాన్ని పూర్తిగా దుప్పటి కింద దాచకుండా, ఒక కాలును బయటకు తీసి నిద్రపోతారు. ఈ వింత అలవాటు కేవలం నిద్రలేమి ఫలితం మాత్రమే కాదనేది శాస్త్రీయంగా తేలింది. దీని కారణంగానే చాలా మందికి నిద్ర నాణ్యత పెంచుకోవచ్చట. శరీరంలో జరిగే అంతర్గత టెంపరేచర్‌ బ్యాలెన్స్‌ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది.

మనం గాఢ నిద్రలోకి జారుకునే ముందు, మన శరీరం అంతర్గత ఉష్ణోగ్రతలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. నిపుణుల ప్రకారం, మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు, శరీర ఉష్ణోగ్రత దాదాపు ఒక డిగ్రీ వరకు తగ్గుతుంది. ఈ ఉష్ణోగ్రత తక్కువే కావచ్చు. కానీ మన మెదడు, శరీరం నిద్రపోవడానికి, ముఖ్యంగా గాఢ నిద్ర దశకు చేరుకోవడానికి ఈ వ్యత్యాసం చాలా అవసరం  

మనం దుప్పటితో పూర్తిగా కప్పేసి ఉంచితే, ఈ ఉష్ణోగ్రత తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీంతో వేడిని తగ్గించాలని శరీరానికి ఇది మన మెదడు సంకేతాలు పంపుతుంది. ఫలితంగా మనకు తెలియకుండానే సహజ చల్లదనం కోసం, సులభంగా నిద్ర పట్టడానికి ఒక కాలును బయటకు తీస్తాం. శరీరం ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి చేపట్టే అసంకల్పిత చర్య. ఏ యాంగిల్‌లో పడుకున్నా చాలా మంది కాలును బయటకు పెట్టి ఉండే విషయాన్ని గమనించ వచ్చు.  

డాక్టర్ జెరాల్డ్ విశ్లేషణ: రక్త నాళాల ప్రత్యేక నెట్‌వర్క్ 

ఈ అలవాటు వెనుక ఉన్న సైంటిఫిక్ మెకానిజాన్ని ఫ్రాన్స్‌కు చెందిన డాక్టర్ జెరాల్డ్ మరింత వివరంగా వివరించారు. మన శరీరంలోని కొన్ని అవయవాలు, ముఖ్యంగా చేతులు, కాళ్ళలో రక్త నాళాల నెట్‌వర్క్ చాలా దట్టంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ అవయవాలలో కండరాల పొర కూడా పలుచగా ఉంటుంది.

ఈ ప్రత్యేకమైన శరీర నిర్మాణం కారణంగా:

1. వేడిని విడుదల చేయడం: ఈ అవయవాలు శరీరం నుంచి వేడిని విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

2. చల్లబరచడం: అవి శరీరాన్ని సమర్థవంతంగా చల్లబరచడంలో సహాయపడతాయి.

మన పాదాలు, మణికట్టు, తల వంటి ప్రాంతాల ద్వారా శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. ఈ భాగాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సహజ రేడియేటర్‌లుగా పనిచేస్తాయి. మనం ఒక కాలును దుప్పటి బయట ఉంచినప్పుడు, రక్త నాళాలు వేడిని విడుదల చేస్తాయి, ఆ వేడి చల్లటి గాలి తగిలి చల్లబడతాయి. ఇలా చల్లబడిన రక్తం తిరిగి శరీరంలోకి ప్రవహించి, అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గించి, గాఢ నిద్రకు కారణమవుతాయి. డాక్టర్ జెరాల్డ్ పరిశోధన, ఈ అలవాటు కేవలం 'నిద్ర కోసం' మాత్రమే కాదు, శరీరం ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థకు నిదర్శనమని స్పష్టం చేసింది.

నిద్ర విషయంలో ప్రజలు రెండు విభిన్న మార్గాలను అనుసరిస్తారు. కొంతమంది చలికి, వేడికి సంబంధం లేకుండా దుప్పటిని కప్పుకొని నిద్రపోతారు. ఇలాంటి వారిని 'బంక్-హగర్స్' అంటారు. మరికొందరు దుప్పటి లేకుండా నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. దుప్పటి కప్పుకుని ఒక కాలు బయటకు తీసే భంగిమలో పడుకునే వారికి, ఈ విధానం మంచి సౌకర్యవంతమైన నిద్రకు కారణమవుతుంది డాక్టర్ జెరాల్డ్ అభిప్రాయపడ్డారు.

ఆధునిక జీవనశైలి, స్క్రీన్ టైమ్, ఇతర కారణాలతో నిద్ర నాణ్యత దెబ్బతీంటున్నాయి. అలాంటి వాళ్లు ఈ టెక్నిక్‌ను ఉపయోగించి నిద్రను మెరుగుపరుచుకోవచ్చు.

1. గాలి తగలనివ్వండి: రాత్రి మీకు నిద్ర రాకపోతే లేదా వేడిగా అనిపిస్తే, మీ పాదాలు లేదా కాలికి కొంత గాలి తగలనివ్వండి.

2. చిన్న అడుగు-పెద్ద ఫలితం: ఈ చిన్న అడుగు మిమ్మల్ని చల్లని, ప్రశాంతమైన గాఢ నిద్రకు కారణమవుతుంది.  

మీ పడకగది ఉష్ణోగ్రతను చల్లగా ఉంచుకోవడం, దుప్పటిని పూర్తిగా కప్పుకోకుండా ఉంచడం ద్వారా శరీరం సహజ శీతలీకరణ యంత్రాంగానికి సహాయం చేయవచ్చు. 

Frequently Asked Questions

నిద్రపోయేటప్పుడు ఒక కాలును బయటకు తీయడం వెనుక శాస్త్రీయ కారణం ఏమిటి?

శరీర అంతర్గత ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి ఈ అలవాటు ఉపయోగపడుతుంది. నిద్రలోకి జారుకునే ముందు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, ఆ ప్రక్రియకు ఇది సహాయపడుతుంది.

శరీరం సహజంగా చల్లబడటానికి ఏయే శరీర భాగాలు సహాయపడతాయి?

పాదాలు, మణికట్టు, తల వంటి శరీర భాగాల ద్వారా ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సహజ రేడియేటర్లుగా పనిచేస్తాయి.

దుప్పటి పూర్తిగా కప్పుకొని నిద్రపోతే నిద్ర నాణ్యత ఎలా ప్రభావితమవుతుంది?

దుప్పటి పూర్తిగా కప్పుకొని ఉంచితే, శరీర ఉష్ణోగ్రత తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల మెదడుకు వేడిని తగ్గించమని సంకేతాలు వెళ్లి, నిద్రకు ఆటంకం కలుగుతుంది.

నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ఏ చిన్న మార్పు చేయవచ్చు?

రాత్రి నిద్ర రాకపోతే లేదా వేడిగా అనిపిస్తే, మీ పాదాలు లేదా కాలికి కొంత గాలి తగిలేలా చూసుకోండి. ఇది చల్లని, ప్రశాంతమైన గాఢ నిద్రకు దారితీస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Savitri : 'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Advertisement

వీడియోలు

Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam
Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Savitri : 'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
Embed widget