News
News
X

Vaccination in Winter: చలికాలం వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే ఏ వ్యాక్సిన్ ఉత్తమం?

చలికాలంలో వ్యాధుల బారిన పడకూడదంటే కొన్ని రకాల వ్యాక్సిన్సులు తీసుకోవడం ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు. అవేంటో చూసేయండి.

FOLLOW US: 
Share:

లికాలం వచ్చిందంటే ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లు ఉనికిలోకి వస్తాయి. శీతాకాలంలోని చల్లని వాతావరణం వాటి వ్యాప్తికి అనుకూలంగా ఉండటమే ఇందుకు కారణం. మనుషుల నుంచి మనుషులకు సులభంగా సంక్రమిస్తాయి. ఫలితంగా ఈ సీజన్ మొత్తం జలుబు, రొంప, దగ్గులతో ముప్పుతిప్పలు పెడతాయి. అంతేకాదు, కొందరికి ఇంతకంటే భయానక వ్యాధులు పీడిస్తాయి. వాటి నుంచి బయటపడాలంటే.. కొన్ని వ్యాక్సిన్లు తీసుకోవడం ఉత్తమం అని వైద్యులు నిపుణులు చెబుతున్నారు. 

శీతాకాలం చాలా మంది జబ్బు పడుతుంటారు. కొందరు వైరల్ ఫీవర్లతో బాధపడితే.. మరికొందరు మాత్రం సీజనల్ ఇన్ఫ్లుఎంజాలతో ఇబ్బందిపడుతుంటారు. వీటిలో ప్రధానంగా చెప్పుకోదగినవి జ్వరం, శ్వాసకోశ సమస్యలు, తుమ్ములు, ముక్కు బిగుసుకుపోవడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆర్థోమైక్సోవిరిడే అనే తరగతికి చెందిన పేరులేని వైరస్ ద్వారా వస్తుంటాయి. 

మనుషుల్లో జబ్బులకు కారణమయ్యే ఇన్ఫ్లూఎంజాలు సాధారణంగా మూడు రకాలు. అవి ఇన్ఫ్లుఎంజా A, ఇన్ఫ్లుఎంజా B, ఇన్ఫ్లుఎంజా C. ఈ ఇన్ఫ్లుఎంజా వైరస్‌ల వలన కాలానుగుణంగా వ్యాధులు రావచ్చు. అలానే మరికొన్ని సమయాల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టే వ్యాధులు కూడా ఈ ఇన్ఫ్లుఎంజాలతో వచ్చే అవకాశం ఉంది. 

ఏటా ఇన్ఫ్లుఎంజా A, B  వైరస్ లతో వచ్చే కాలానుగుణ అంటువ్యాధుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 5 మిలియన్ల వరకు కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాకుండా వేలాది మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మానవుని శరీరం ఈ వ్యాధులను తట్టుకునే విధంగా కొన్ని వ్యాక్సిన్ లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 

ఈ వ్యాక్సిన్ లు సాధారణంగా ప్రబలే జబ్బులతో పాటు, ల్యాబ్‌ల నుంచి పుట్టుకొచ్చే మరికొన్ని వైరస్ లను కూడా ఎదుర్కొగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఇటీవల శాస్త్రవేత్తలు చేపట్టిన సర్వేల ప్రకారం.. ఇన్ఫ్లుఎంజా వ్యాక్సీన్ కారణంగా 18 నుంచి 65 మధ్య వయసు ఉండే వారు ఆసుపత్రి పాలు కావడం 53 శాతం తగ్గిందట. అంతేగాకుండా 65 ఏళ్ల పైబడిన వారిలో 37 శాతం మంది ఆసుపత్రులకు దూరంగా ఉంటున్నట్లు తేలింది. 

రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు నుంచి ఆరోగ్యంగా ఉన్న పెద్దలు వరకు ఎవరైనా డాక్టర్ సలహా మేరకు టీకాను తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వలన దాని నుంచి వారు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మారుతున్న కాలం ప్రకారం ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుంది. ఇది 10 శాతం నుంచి 60 శాతం వరకు రక్షణ ఇస్తుంది. కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే వ్యాక్సిన్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. 

ఇన్ఫ్లుఎంజాకు కు సంబంధించిన ట్రైవాలెంట్, క్వాడ్రివాలెంట్ టీకాలు రెండింటినీ ఎఫ్.డీ.ఏ ఆమోదించింది. ట్రివాలెంట్ టీకా మూడు ఫ్లూ జాతుల నుంచి మానవులను రక్షిస్తుంది. ముఖ్యంగా ఇది రెండు ఇన్ఫ్లుఎంజా A జాతులు, ఒక ఇన్ఫ్లుఎంజా B జాతికి చెందిన వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ఇదిలా ఉంటే క్వాడ్రివాలెంట్ ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్ ఏకంగా నాలుగు వేర్వేరు ఫ్లూ వైరస్‌ల నుంచి రక్షిస్తుంది. వీటిలో రెండు ఇన్‌ఫ్లుఎంజా A వైరస్‌లతో పాటు రెండు ఇన్‌ఫ్లుఎంజా B వైరస్‌లు కూడా ఉన్నాయి. 

చలికాలంలో ఈ టీకాలు తీసుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడమే కాదు.. ఇతరులను కూడా రక్షించవచ్చు. టీకా పూర్తిగా ప్రభావం చూపేందుకు సుమారు రెండు వారాల పాటు సమయం పడుతుంది. కాబట్టి జబ్బును గుర్తించిన వెంటనే టీకా తీసుకోవడం మంచిది. శరీరానికి ఇంత మంచి చేసే టీకాల పట్ల అభద్రత భావం ఇంకా చాలా మందిలో ఉంటుంది. కానీ అలాంటి ముఢనమ్మకాలకు దూరంగా ఉండాలని కామినేని ఆసుపత్రి వైద్యులు(విజయవాడ) డాక్టర్ ఎన్.ఆర్.ఎస్. వర్ధన్ పేర్కొన్నారు. 

Also read: ఈ ఐదు ఆకుపచ్చని పదార్థాలు తింటే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది

Published at : 17 Dec 2022 11:56 PM (IST) Tags: Vaccination Viral Fevers vaccination in winter Winter Vaccination Winter health problems Winter fevers

సంబంధిత కథనాలు

Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం

Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం

ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

టాప్ స్టోరీస్

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్