News
News
X

Egg Shells: గుడ్డునే కాదు, గుడ్డు పెంకులను తినమని పోషకాహార నిపుణులు చెబుతున్నారెందుకు?

గుడ్డును తిని గుడ్డు పెంకులను పడేస్తాం, కానీ గుడ్డు పెంకులను కూడా అప్పుడప్పుడు తినమని సిఫార్సు చేస్తున్నారు పోషకాహార నిపుణులు.

FOLLOW US: 
Share:

సంపూర్ణమైన ఆహారం అంటే కోడిగుడ్డే అని చెబుతారు పోషకాహార నిపుణులు. సమతుల్య ఆహారాన్ని అందించడంలో కోడిగుడ్డు ముందుంటుంది. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొనలో మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. మన శరీరానికి అత్యవసరమైన అమైనో ఆమ్లాలు గుడ్డులోనే ఉంటాయి. అందుకే రోజుకో గుడ్డు తినమని చెబుతారు వైద్యులు.  సాధారణంగా గుడ్లు తింటాం కానీ గుడ్డు పెంకులను ఎవరు తినము, కొంతమంది పోషకాహార నిపుణులు వాటిని కూడా అప్పుడప్పుడు తినమని చెబుతున్నారు. గుడ్డులో ఎన్ని పోషకాలు ఉంటాయో...  గుడ్డు పెంకులలో కూడా అన్ని పోషకాలు ఉంటాయని వారు వివరిస్తున్నారు.

పెంకుల్లో ఏముంటుంది?
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్, ప్రోటీన్లు ఇతర ఖనిజాలు ఉంటాయి.  పోషకాహార నిపుణులు నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిశీలిస్తే ఒక గుడ్డు పెంకులో సగం తిన్నా కూడా మన శరీరానికి కావలసిన రోజువారీ క్యాల్షియం దొరుకుతుందని వివరిస్తున్నారు.

గుడ్డు పెంకులో లభించే కాల్షియం కార్బోనేట్ వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ పెంకులో మెగ్నీషియం, ఫ్లోరైడ్ వంటి ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. ఆస్టియోపోరొసిస్ వంటి ఎముకలను బలహీనపరిచే వ్యాధుల నుంచి గుడ్డు పెంకులు కాపాడతాయని వివరిస్తున్నారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఆస్టియోపొరోసిస్. కాల్షియం లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. గుడ్డు పెంకులను తినడం వల్ల ఈ సమస్య రాకుండా అడ్డుకోవచ్చు.

గుడ్డు తినేవారు గమనించే ఉంటారు... గుడ్డుకు, గుడ్డు పెంకుకు మధ్య పలుచటి పొర ఉంటుంది. ఆ పొరను చాలామంది తీసి పడేస్తారు కానీ, ఆ పొర కూడా తినాల్సిన అవసరం ఉంది. అది కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పెంకులను ఎలా తినాలి?
గుడ్డు పెంకులు తినమని చెప్పడం సులువే కానీ వాటిని ఎలా తినాలో చాలామందికి తెలియదు. గుడ్డు పెంకులు తినడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే... గుడ్డును ఉడకబెట్టాక పెంకులను తొలగించాలి. తొలగించిన ఆ పెంకులను పౌడర్ రూపంలో మార్చుకోవాలి. ఆ పొడిని ఆహారంలో కలుపుకొని తింటే సులువుగా పొట్టలోకి చేరిపోతుంది. గుడ్డు పెంకులకు ప్రత్యేకమైన రుచి ఉండదు, కాబట్టి తినడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది గుడ్డు పెంకులను ముక్కలు ముక్కలుగా తినాలని చూస్తారు. అలా తినడం వల్ల గొంతులో ఆ ముక్కలు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అన్నవాహికకు కూడా ఇలా గుడ్డు పెంకులు తినడం వల్ల సమస్య రావచ్చు. పచ్చి గుడ్డు పెంకును తినకూడదు. పచ్చి గుడ్డు మీద ఉన్న పెంకులు తినడం వల్ల ‘సాల్మొనెల్ల ఎంటరిటిడిస్’ వంటి బ్యాక్టీరియా శరీరంలో చేరి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.

Also read: తేనె ఎప్పటికీ పాడవదు ఎందుకో తెలుసా? కారణాలు వివరిస్తున్న పరిశోధకులు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 01 Mar 2023 08:22 AM (IST) Tags: Egg Shells benefits Eat egg shells Egg shells Uses

సంబంధిత కథనాలు

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

New Corona Cases : దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు - ఆ వేరియంటే కారణమా ?

New Corona Cases : దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు - ఆ వేరియంటే కారణమా ?

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్