News
News
వీడియోలు ఆటలు
X

RO Water: RO నీటిని ఇంట్లో వినియోగిస్తున్నారా? అయితే మీరు ఈ ముఖ్యమైన విటమిన్ లోపం బారిన పడవచ్చు

RO నీరు మంచిదే, కానీ దీనివల్ల విటమిన్ బి12 లోపం రావచ్చు.

FOLLOW US: 
Share:

కుళాయి నీటిలో హానికరమైన టాక్సిన్లు, సీసం వంటి అకర్బన సమ్మేళనాలు ఉండే అవకాశం ఉంది. వీటివల్ల ఆరోగ్యానికి చాలా చేటు. అందుకే ఎంతోమంది ఇళ్లల్లో RO లను పెట్టుకుంటున్నారు. దీన్ని వాడడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లను ఇది 97% వరకు శుభ్రం చేస్తుంది.  ఇవి నీటిలోని మలినాలను తొలగిస్తాయి. అయితే ఒక అధ్యయనం ప్రకారం నిత్యం RO వాటర్ తాగేవారు బి12 లోపానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శాఖాహారులే ఈ విటమిన్ లోపం బారిన పడవచ్చు.

ఎలా బి12 లోపిస్తుంది?
విటమిన్ బి12 మన శరీరానికి అత్యవసరం.అయితే ROలో నీరు ప్రవహిస్తున్నప్పుడు అక్కడున్న ప్యూరిఫైయర్లు నీటిలో ఉన్న కోబాల్ట్ ను తొలగిస్తాయి. విటమిన్ బి12 సంశ్లేషణకు కోబాల్ట్ చాలా అవసరం. ఇది లోపిస్తే మన పొట్ట లైనింగ్ దెబ్బతింటుంది. విపరీతమైన అలసట వస్తుంది.  ఈ అధ్యయనంలో భాగంగా 160 మంది రోగులపై పరిశోధన చేశారు. వారందరిలోనూ బి12 లోపం ఉంది. వారంతా శాఖాహారులు. అంతేకాదు వీరంతా ఇళ్లలో ROను ఉపయోగిస్తారు.అందరిలోనూ విటమిన్ బి12 లోపం వచ్చింది. విటమిన్ బి12 లోపిస్తే రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. శరీరంలో ఎర్ర రక్తకణాలు సరిపడేంత ఉత్పత్తి కావు. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ వెళ్లడం తగ్గుతుంది. అవయవాలకు సరిపడా ఆక్సిజన్ అందక అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే విటమిన్ బి12 లోపం రాకుండా చూసుకోవాలి.

కనిపించే లక్షణాలు
విటమిన్ బి12 లోపిస్తే శరీరంలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తేలికగా తీసుకుని వదిలేయకూడదు.
1. కండరాలు బలహీనంగా అనిపిస్తాయి 
2. చేతులు, కాళ్లలో తిమ్మిరి పడుతుంది 
3. నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది 
4. ఆకలి తగ్గుతుంది 
5. బరువు తగ్గుతారు 
6. వికారంగా అనిపిస్తుంది 
7. చికాకుగా అనిపిస్తుంది 
8. నాలుక సున్నితంగా మారుతుంది 

ఏం తినాలి?
విటమిన్ బి12 లోపం బారిన పడకుండా ఉండాలంటే రోజూ కొన్ని రకాల ఆహారాలు తప్పకుండా తినాలి. పాలు,  చీజ్, పెరుగు, చికెన్, మటన్, చేపలు, గుడ్లు, సోయా పాలు, పప్పులు... ఇలాంటి వాటిల్లో బి12 పుష్కలంగా లభిస్తుంది. RO నీళ్లు తాగుతున్నా కూడా వీటిని తినడం వల్ల ఆ లోపాన్ని తగ్గించుకోవచ్చు.  రోజూవారీ ఆహారంలో ఇక్కడ చెప్పిన ఆహారాల్లో కనీసం రెండింటినైనా తినాలి. అలా తినడం వల్ల విటమిన్  లోపం నుంచి తప్పించుకోవచ్చు. శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలో ఇది కూడా ఒకటి. కాబట్టి దీన్ని లోపాన్ని తేలికగా తీసుకోకూడదు.

Also read: డయాబెటిస్ అదుపులో ఉండాలా? రోజూ ఈ పానీయాన్ని తాగండి

Also read: నా భార్య నా తల్లిదండ్రుల ముందు అలా ప్రవర్తిస్తోంది, వారు లేనప్పుడు మరోలా ఉంటోంది, ఆమెను మార్చడం ఎలా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Published at : 23 Apr 2023 08:23 AM (IST) Tags: Vitamin B12 Vitamins Deficiency RO water RO water Risks RO water vitamins

సంబంధిత కథనాలు

షవర్ బాత్ చేస్తుంటే తలనొప్పి, మహిళకు అరుదైన సమస్య - కారణం ఏమిటీ?

షవర్ బాత్ చేస్తుంటే తలనొప్పి, మహిళకు అరుదైన సమస్య - కారణం ఏమిటీ?

Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం

Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం

Demetia: డిమెన్షియా‌ను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?

Demetia: డిమెన్షియా‌ను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?

ఓ మై గాడ్, ఈ ఫుడ్‌లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!

ఓ మై గాడ్, ఈ ఫుడ్‌లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!

Workplace Burnout: ‘వర్క్ ప్లేస్ బర్న్ అవుట్’ అంటే ఏంటో తెలుసా? పెళ్లైన పురుషులకు ఈ బాధ తక్కువేనట!

Workplace Burnout: ‘వర్క్ ప్లేస్ బర్న్ అవుట్’ అంటే ఏంటో తెలుసా? పెళ్లైన పురుషులకు ఈ బాధ తక్కువేనట!

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం