పిల్లలు పరగడుపునే ఖాళీ పొట్టతో తినాల్సిన ఐదు ఆహారాలు ఇవే, తింటే వారి ఆరోగ్యానికి తిరుగులేదు
పిల్లల ఆరోగ్యం పై తల్లిదండ్రులకు ఎంతో శ్రద్ధ ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ కథనం.
![పిల్లలు పరగడుపునే ఖాళీ పొట్టతో తినాల్సిన ఐదు ఆహారాలు ఇవే, తింటే వారి ఆరోగ్యానికి తిరుగులేదు These are the five foods that children should eat on an empty stomach పిల్లలు పరగడుపునే ఖాళీ పొట్టతో తినాల్సిన ఐదు ఆహారాలు ఇవే, తింటే వారి ఆరోగ్యానికి తిరుగులేదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/c506902cd6a9b58a9fd9f7f3ebc34e7a1676084222003248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పరగడుపున పెద్దలు మాత్రమే కొన్ని ఆహారాలు తినడం వల్ల ఆరోగ్య లాభాలు పొందుతారని అనుకుంటారు, కానీ పిల్లలకు కూడా పరగడుపున కొన్ని పదార్థాలు లేదా పానీయాలు తాగించాల్సిన అవసరం ఉంది. అలా ఖాళీ పొట్టతో వాటిని తినడం లేదా తాగడం చేయడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలామంది పిల్లలు ఉదయం వేళల్లో అనారోగ్యకరమైన ఆహారంతో రోజు మొదలు పెడతారు. లేదా ఏమీ తినకుండా ఎక్కువ సేపు ఖాళీ పొట్టతో ఉంటారు. ఈ రెండు కూడా ఆరోగ్యానికి చెడ్డవే. వారు రోజంతా చురుకుగా ఉండడానికి పరగడుపున వారికి ఇవ్వాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకోండి.
బాదం
బాదం పప్పులు రాత్రి నానబెట్టి ఉదయాన పిల్లల చేత తినిపించడం వల్ల వారి శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పప్పులో ప్రోటీన్లు, ఐరన్, ఫైబర్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పు తినడం వల్ల పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
అరటి పండు
దీనిలో కార్బోహైడ్రేట్లు, జింక్, సోడియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ పొట్టతో పిల్లలకు అరటి పండ్లు ఇవ్వడం వల్ల వారి బరువు పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటి పండ్లను రోజూ ఉదయం లేచాక ఖాళీ పొట్టతో పిల్లలకు తినిపించవచ్చు.
ఉసిరి జామ్
దీన్ని ఆమ్లా మార్మలాడే అని పిలుస్తారు. ఇది పోషకాల నిధి. ఇందులో కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఉదయం పూట ఖాళీ పొట్టతో ఉసిరికాయ జామ్ ని తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. పిల్లల పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని ఉసిరి జామ్ తగ్గిస్తుంది.
ఆపిల్
ఆపిల్‌లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఖాళీ పొట్టతో ఆపిల్ పండును తినవచ్చా లేదా అనే సందేహం మాత్రం ఎక్కువమందిలో ఉంది. ఉదయం పూట ఖాళీ పొట్టతో పిల్లలకు యాపిల్ పండ్లను ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి, కంటి చూపు మెరుగవుతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వారికి ఉదయం లేచాక యాపిల్ పండ్లను తినిపించాలి.
గోరువెచ్చని నీరు
ఉదయం నిద్ర లేవగానే ఖాళీ పొట్టతో గోరువెచ్చని నీరు పిల్లలకి ఇవ్వడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.
పైన చెప్పిన పదార్థాలను ప్రతిరోజు పిల్లలు ఖాళీ పొట్టతో తినేలా చేయాలి.అప్పుడు మీ బిడ్డకు ఏ వ్యాధి, అలెర్జీలు రాకుండా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మూడేళ్ల కన్నా ఎక్కువ వయసున్న పిల్లలకు మాత్రమే ఇవ్వాలి.
Also read: మీకు తరచూ గోళ్లు కొరికే అలవాటు ఉందా? జాగ్రత్త ఈ సమస్య బారిన త్వరగా పడతారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)