News
News
X

మీకు తరచూ గోళ్లు కొరికే అలవాటు ఉందా? జాగ్రత్త ఈ సమస్య బారిన త్వరగా పడతారు

ఎక్కువ మందికి ఉండే అలవాటు గోళ్లు కొరకడం. అది ఒక్కోసారి ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌కి కారణం కావచ్చు.

FOLLOW US: 
Share:

గోళ్లు కొరకడం అనేది మంచి అలవాటు కాదు. గోళ్లు కొరికే అలవాటు ఉంటే అది మానుకోవడం చాలా మంచిది. లేకపోతే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది.  గోళ్లు అపరిశుభ్రంగా ఉండడం వల్ల వాటిని నోట్లో పెడితే అంటురోగాలకు కారణం కావచ్చు. అంతేకాదు గోరు చుట్టూ ఉండే  చర్మానికి గాయం కలిగి చికాకు, మంట వస్తుంది. ఒక్కొక్కసారి ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌గా మారిపోతుంది. దీన్ని పరోనిచియా అని పిలుస్తారు. బ్యాక్టీరియా చర్మపు సందుల్లోంచి గోరు మడతల్లోకి ప్రవేశించి అక్కడ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది తీవ్రమైన నొప్పిని, మంటను కలిగి ఉంటుంది. చీము కూడా పడుతుంది. ఇది ఎక్కువైతే జ్వరం, అలసట, మైకం వంటివి కమ్ముతాయి. వేలు లోపలికి ఈ ఇన్ఫెక్షన్ చేరితే ఒక్కొక్కసారి ఆ వేలును తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.

గోళ్లను కొరకడం, నోటితో తీయడం, అందం కోసం చేయించుకునే చికిత్సల వల్ల చర్మం దెబ్బతిని ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇది స్టెఫీలో కాకస్, ఎంట్రో కాకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుందని వైద్యులు చెబుతారు. కొన్ని వారాలపాటు ఇది ఇబ్బంది పెడుతుంది. ఎక్కువగా నీటిలో పనిచేసే వ్యక్తుల్లో ఇది కలుగుతుంది.

ఇది వస్తే లక్షణాలు ఎలా ఉంటాయంటే
1. గోరుచుట్టు చర్మం ఎరుపుగా మారుతుంది.
2. అక్కడ చర్మం సున్నితంగా మారి ముట్టుకుంటే నొప్పి వస్తుంది. 
3. గోరుచుట్టు చీముతో నిండిన పొక్కులు వస్తాయి. 
4. ముట్టుకుంటే గోరు చాలా నొప్పిగా అనిపిస్తుంది. 
5. ఈ ఇన్ఫెక్షన్ అధికంగా మారితే జ్వరం, మైకం సమస్యలు మొదలవుతాయి. 

ఎలా నివారించాలి 
గోరు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ చేతులను కడిగిన తర్వాత వెంటనే తుడుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. గోళ్లు కొరకడం చేయకూడదు. మీరు వాడే నెయిల్ కట్టర్‌ను ఇతరులతో ఎప్పుడూ షేర్ చేసుకోకండి. ఉపయోగించిన తర్వాత నీళ్లు శుభ్రపరచుకోవాలి. చేతి గోళ్లు శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. గోళ్లను ఎక్కువసేపు నీటిలో నాననివ్వకూడదు. గోళ్లు పెద్దగా పెంచే కన్నా చిన్నగా పెంచుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

చికిత్స 
పరోనిచియా సోకిన గోరు క్యూటికల్స్‌ను డాక్టర్లు శుభ్రపరుస్తారు. ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, శిలీంద్రాలను తొలగించేందుకు ప్రయత్నిస్తారు. వీటికి కొన్ని రకాల క్రీములు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగిన క్రీములను ఇచ్చి బ్యాక్టీరియాను చంపేందుకు ప్రయత్నిస్తారు. మారక ముందే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. 

సమస్య వచ్చాక చికిత్స గురించి ఆలోచించే బదులు, అసలు ఆ సమస్య బారిన పడకుండా ఉండడమే మంచిది. కాబట్టి గోళ్లను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ఈ అనారోగ్యం రాకుండా అడ్డుకోవచ్చు.

Also read: డ్రై ఫ్రూట్స్‌ను ఇంట్లోనే సులువుగా ఇలా తయారు చేసేయండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 11 Feb 2023 08:17 AM (IST) Tags: Nails Healthy life Nails Health Dont bite your nails

సంబంధిత కథనాలు

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

Ice Apple: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!

Ice Apple: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

Ramadan Food: రంజాన్ ఉపవాసం విరమించిన తర్వాత ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటారో తెలుసా?

Ramadan Food: రంజాన్ ఉపవాసం విరమించిన తర్వాత ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటారో తెలుసా?

Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల