By: ABP Desam | Updated at : 28 Feb 2022 07:34 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
కొన్ని కుక్కల ఒంటినిండా బొచ్చుతో చూడటానికి ముద్దుగా ఉంటాయి. మరికొన్ని ఎత్తుగా, లావుగా గంభీరంగా ఉంటాయి. జాతిని బట్టి వాటి రూపాలు, పరిమాణాలు మారుతుంటాయి. ఏ జాతి కుక్కయినా ఫర్వాలేదు, అది ఇంట్లో ఉంటే చాలు, ఆ ఇంటి వారికి చాలా మేలు జరుగుతుందని చెబుతోంది తాజా అధ్యయనం. డిప్రెషన్ బారిన పడకుండా కాపాడుతుంది, మంచి నిద్ర వచ్చేలా చేస్తుంది, వ్యాయామం చేసేలా ప్రోత్సహిస్తుంది... ఇలా మనకు తెలియకుండా ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. అన్నింటికన్నా ముఖ్యంగా కుక్కతో చేసే స్నేహం వల్ల మనుషులకు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పే రుజువు దొరికింది. అందుకేు వీలైతే ఇంట్లో ఓ కుక్కపిల్లను పెంచుకోమని చెబుతున్నారు.
ప్రపంచంలోని ప్రజలు ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలను ‘బ్లూ జోన్లు’గా పిలుస్తున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ఫెల్లో, అవార్డు విన్నింగ్ జర్నలిస్తు, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్ రచయిత అయిన డాన్ బ్యూట్నర్ ప్రపంచాన్ని తిరిగి వచ్చాడు. అతను ఐయిదు ప్రదేశాలను బ్లూజోన్లగా గుర్తించాడు. ఇక్కడ ప్రజలు ఆరోగ్యమైన జీవితాలను బతకడం గమనించాడు. తన టీమ్‌తో కలిసి బ్లూ జోన్లలో నివసిస్తున్న ప్రజలు ఎలా నివిస్తున్నారో, వారందరి ఉమ్మడి గుణం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వారి పరిశోధనలో మంచి ఆరోగ్యపు అలవాట్లు, సామాజిక అనుబంధం ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు గుర్తించారు.
1. సాధారణ శారీరక శ్రమ
2. జీవితానికో నిర్ధిష్ట లక్ష్యం
3. ఒత్తిడి లేని జీవితం
4. కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తినడం
5. మొక్కల ఆధారిత ఆహారంపై ఆధారపడడం
6. ఆల్కహాల్ తక్కువగా తాగడం
7. ఆధ్యాత్మికత
8. కుటుంబంతో అనుబంధం
9. సామాజికంగా అనుబంధాలను కలిగి ఉండడం
పైన చెప్పినవన్నీ వారి ఆరోగ్యకరమైన జీవితానికి కారణాలుగా కనిపెట్టారు.
పెంపుడు కుక్కలు కూడా..
ఈ అధ్యయనంలో పెంపుడుకుక్కల వల్ల కూడా ఆరోగ్యం మెరుగవుతున్నట్టు కనిపెట్టారు.ఇవి వ్యాయామాన్ని పెంచుతాయని తద్వారా శరీరానికి మేలు జరుగుతుందని గుర్తించారు. అంతేకాదు ఇవి వాటి యజమానులలో గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతాయని కనిపెట్టారు. స్వీడన్లోని ఉప్ప్సల విశ్వ విద్యాలయం వారు ఇచ్చిన నివేదికలో 34 లక్షల మంది ప్రజలు ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. వారిలో 40 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్నవారికి ప్రేమపూర్వక మైన శునకం ఉన్నట్టయితే వారు గుండె సంబంధ వ్యాధులతో చనిపోయే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కుక్కలు పెంచుకోని వారు, వాటిని పెంచుకుంటున్న వారితో పోలిస్తే ముందుగానే చనిపోయే అవకాశం 33 శాతం ఎక్కువట. శునకాలు యజమానికొచ్చే గుండె జబ్బులను పసిగడతాయని కూడా అంటారు.
Also read: పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందా ! అధ్యయనంలో తేలిన విషయాలివే
Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!
US Monkeypox Cases : అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన
Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!
Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!