Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే
ఆరోగ్యమైన కొన్ని ఆహారాలే గుండెకి హాని చేస్తాయి. అటువంటి వాటిని అసలు తీసుకోకపోవడమే మంచిది. లేదంటే గుండెని ప్రమాదంలో పడేసినట్టే.
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మరణాలు గుండె జబ్బుల వల్ల జరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి కారణాల వల్ల గుండె ప్రమాదంలో పడిపోతుంది. అందుకే గుండెని ఆరోగ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసమతుల్య ఆహారం, ఫిట్ నెస్ సమస్యలు, ఆల్కహాల్, పొగాడు వాడకం, ఒత్తిడి వంటి ముఖ్యమైనవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండె పోటు వచ్చి సడెన్ గా కుప్పకూలిపోయి ప్రాణాలు విడుస్తున్న వారి గురించి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటున్నాం. కార్డియాక్ అరెస్ట్, గుండె వైఫల్యం, గుండె పోటు, కార్డియో వాస్కులర్ డిసీజ్ బారిన పడుతున్నారు.
గుండెని ఆరోగ్యంగా ఉంచాలంటే ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆరోగ్యకరమైన, అనారోగ్యకరమైన ఆహారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవి. ఈ ఆహార పదార్థాలు మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
చిప్స్: స్పైసీగా, క్రంచీ గా ఉండే రుచికరమైన స్నాక్స్ బంగాళాదుంప చిప్స్. కానీ ఇవి కృత్రిమ రుచులు, నూనె, సోడియంతో నిండి ఉంటాయి. ఊబకాయానికి దారి తీస్తాయి. రక్తపోటుని పెంచుతాయి. దీని వల్ల గుండె జబ్బులు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.
సాసేజ్: సాసేజ్ లు ఆరోగ్యకరమైన ఎంపికని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు కాదు. ఈ ఆహారంలో కేలరీలు, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను పెంచుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇవి క్యాన్సర్ తోను ముడి పడి ఉన్నాయి.
ప్రోటీన్లు: ఆరోగ్యకరమైన గుండె, శరీర బరువు కోసం ప్రోటీన్లు తప్పనిసరి. కానీ సరైన పరిమాణం ఎంచుకోవాలి. ఎక్కువ ప్రోటీన్లు తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. గూండే ఆగిపోయే ప్రమాదాన్ని 33 శాతం పెంచుతుంది.
కొబ్బరినూనె: కొబ్బరి నూనె గుండెకి ఆరోగ్యకరమైన ఎంపికని భావిస్తారు. కానీ ఇది సంతృప్త కొవ్వులతో నిండి ఉంటుంది. ధమనుల్లో అడ్డంకులను కలిగిస్తుంది. దీన్నే అథెరోస్క్లెరోసిస్ అని పిలుస్తారు.
ఎనర్జీ డ్రింక్స్: తక్షణ శక్తినిచ్చే వాటిలో ఎనర్జీ డ్రింక్స్ కీలకంగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి ఏ విధంగానూ మేలు చెయ్యవు. కృత్రిమ రుచులు, చక్కెర, కెఫీన్ అధికంగా కలిగి ఉండటం వల్ల గుండె సమస్యలు, అరిథ్మియా, రక్తపోటుని ప్రేరేపిస్తాయి. సాధారణంగానే చక్కెర చాలా చేటు. అందుకే వీలైనంత వరకు దాన్ని దూరం పెట్టడమే మంచిది.
ఫుడ్డింగ్: ఫంక్షన్లు, సంతోషకరమైన సందర్భాల్లో అతిగా తినేస్తారు. స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ తింటే ఎంత తింటున్నామనేది కూడా గ్రహించుకోలేరు. దీని వల్ల కేలరీలు పెరిగిపోతాయి. బరువు పెరగడం, స్థూలకాయం, ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్ కి దారి తీస్తుంది. ఇవన్నీ గుండెకి హాని కలిగించేవి. ఇదే కాదు ఆల్కహాల్ అన్నింటికంటే ప్రమాదరకరమైంది. ఈ అలవాటు తప్పనిసరిగా మానుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి