News
News
వీడియోలు ఆటలు
X

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోతున్నారా? డబ్బులు ఖర్చు ఎక్కువగా ఉంటూ పొదుపు చేయలేకపోతున్నారా? ఈ మాగ్నెట్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టుకోండి.

FOLLOW US: 
Share:

డబ్బు సంపాదిస్తున్నారు? కానీ చేతిలో మాత్రం చిల్లి గవ్వ కూడా నిలవడం లేదా? ఏదో ఒక విధంగా డబ్బులన్నీ ఖర్చయిపోయి సేవింగ్స్ ఏమి చేయలేకపోతున్నారా? అయితే ఇది మీ కోసమే. చాలా మంది డబ్బుని నిలుపుకోవడానికి అనేక సంప్రదాయ మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే డబ్బుకు కొదవ ఉండదని అంటుంటారు. ఇవే కాదు ధాన్యాలు ఉంచడం, డబ్బుల పర్సులో లవంగాలు పెట్టుకోవడం, దాల్చిన చెక్క పొడి వాటికి రాయడం వంటివి చేస్తూనే ఉంటారు. అటువంటిదే ఇది కూడాను. మీ డబ్బును నిలుపుకునే ఈ సింపుల్ మార్గం మీరు అనుసరించి చూడండి.

ఇంట్లో డబ్బు నిలవడం లేదంటే వాస్తు దోషమని అనుకుంటారు. లేదంటే అదృష్టం కలిసి రావడం లేదని బాధపడతారు. కానీ మీ డబ్బును పొదుపు చేసుకునే అద్భుతమైన సింపుల్ రెమిడికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇంట్లో డబ్బును ఆకర్షించే ఒక కుండని సృష్టించి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది. ఈ కుండని మీరు ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో కూడా చెప్పారు.

మ్యాజిక్ మట్టి కుండ..!

ఒక చిన్న మట్టి కుండ తీసుకుని దాన్ని 5 రూపాయల నాణేలు వేసుకోవాలి. అందుకే రూపాయి, రెండు రూపాయిల నాణేలు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం. ఆ తర్వాత 5 రకాల ధాన్యాలు తీసుకోవాలి. వంటగదిలో ఇవి సులభంగా దొరికేస్తాయి. బియ్యం, మొక్కజొన్న, గోధుమలు, బార్లీ, మరేదైనా ధాన్యంతో కుండని నింపుకోవాలి. ఈ కుండ మీద ఎర్రటి వస్త్రం కప్పాలి. తర్వాత ఎరుపు రంగు దారంతో దాన్ని మూసేసి 24 గంటల పాటు ఇంటి పూజ గదిలో పెట్టుకోండి. తర్వాత దీన్ని మీరు మీ అల్మరా లేదా ఇంకెక్కడైనా భద్రంగా దాచుకోవచ్చు.

మట్టి, గింజలు ఎందుకు?

మట్టి కుండని ఉపయోగించడానికి కారణం అది భూమిని సూచిస్తుంది. వస్తువులను తన వైపుకు లాక్కోగల గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. అది కుండకు కూడా వర్తిస్తుంది. ఇక అందులో వేసే ప్రధానమైన ధాన్యాలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఇవి ఇంట్లో ప్రవృత్తిని తెస్తాయని నమ్ముతారు. ఆ వైరల్ వీడియో మీద మీరు ఒక లుక్కేయండి.  

Also Read: ఈ టిప్స్ పాటించారంటే ప్రెజర్ కుక్కర్లో కేక్ సింపుల్ గా చేసెయ్యొచ్చు

View this post on Instagram
 
A post shared by Rahul Astrologer 🇮🇳 (@askin_astrology)

గమనిక : వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.. కొన్ని నమ్మకాలు, ఆర్థిక సమస్యల పరిష్కరాల సూచనల ఆధారంగా ఈ సమాచారాన్ని మీ అవగాహన అందించాం.

Published at : 31 Mar 2023 07:00 AM (IST) Tags: Mud Pot Money Savings Tips Money Saving Magical Pot

సంబంధిత కథనాలు

Ghee: ఈ సమస్యలు ఉంటే నెయ్యి తినడం తగ్గించాల్సిందే

Ghee: ఈ సమస్యలు ఉంటే నెయ్యి తినడం తగ్గించాల్సిందే

Skin Glow: చర్మం మెరిసిపోవాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవిగో

Skin Glow: చర్మం మెరిసిపోవాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవిగో

Chai-Biscuit: ఛాయ్‌తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే

Chai-Biscuit: ఛాయ్‌తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే

Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు

Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు

White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే

White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే

టాప్ స్టోరీస్

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్