News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Delhi Omicron : ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ కేసు.. ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తింపు !

దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ రెండో కేసు నమోదయింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వేల్లో పర్యటించిన వ్యక్తికి పాజిటివ్‌గా గుర్తించారు.

FOLLOW US: 
Share:

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీలో రెండో కేసు నమోదయింది. జింబాబ్వే, దక్షిణాఫ్రికాల్లో పర్యటించి వచ్చిన వ్యక్తి శాంపిల్స్‌ను అధికారులు పరీక్షించినప్పుడు అతనిలో ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ వ్యక్తి రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. విదేశాల నుంచి ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటున్నాయి. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తున్నారు. 

Also Read : కోవిషీల్డ్ మూడో డోస్‌కు నో.. "సీరం"కు పర్మిషన్ ఇవ్వని కేంద్రం !

సాధారణ కరోనా కేసులు దేశంలో తగ్గిపోతున్నాయి. కానీ కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో వైరస్ వ్యాప్తి చెందుతుండటతో అధికారులు కూడా ఆందోళనచెందుతున్నారు.  ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు 32కి చేరాయి. నిన్న ఒక్కరోజే 9 మందిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ.. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  

Also Read : వామ్మో ఒమిక్రాన్.. ఒక్క రోజులో 4 వేల మందికా? గత వైరస్‌ల కంటే వేగంగా కొత్త వైరస్!

దక్షిణాఫ్రికాలో మొదట వెలుగు చూసిన ఈ కరోనా కొత్త వేరియంట్‌.. రెండో దశలో వార్తలకెక్కిన డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాపిస్తున్నది. దీనిలో కొన్ని ప్రమాదకర లక్షణాలు ఉన్నందున ఒమిక్రాన్‌ను వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ గా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ . ఈ వైరస్‌ వల్ల పెద్దగా ప్రాణ నష్టం లేకపోయినా.. ఒకరి నుంచి మరొకరికి వాయువేగంతో వ్యాపిస్తుందని మాత్రం వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Also Read : మహారాష్ట్రలో ఒమిక్రాన్ కలకలం... ఒక్కరోజే కొత్తగా 7 కేసులు... దేశంలో 32కు చేరిన కేసుల సంఖ్య

ఒమిక్రాన్ లక్షణాలు తీవ్రంగా లేవు. అయితే చిన్న పిల్లలకూ వ్యాపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త వేరియంట్‌లోవ్యాధి ప్రమాద స్థాయి కూడా పెరిగిందని ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారినీ వదలదు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో వైరస్‌ ప్రభావం తక్కువగాను, తీసుకోని వారిలో కొంత అధికంగాను ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. 

Also Read: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Dec 2021 12:04 PM (IST) Tags: delhi covid cases in india omicron variant omicron cases in india second case of the COVID-19 Omicron variant fully vaccinated person indiaOmicron India Omicron virus India Coronavirus India Delhi Omicron case

ఇవి కూడా చూడండి

ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, జాగ్రత్త

ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, జాగ్రత్త

Green Banana: పచ్చి అరటి పండు తినడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చా?

Green Banana: పచ్చి అరటి పండు తినడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చా?

FSSAI: న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయొద్దు, ఆరోగ్యానికి ప్రమాదం- ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక

FSSAI: న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయొద్దు, ఆరోగ్యానికి ప్రమాదం- ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక

Brain: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి

Brain: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి

Mehendi: మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

Mehendi: మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

టాప్ స్టోరీస్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?