Brain Stroke App: అద్భుతం.. స్ట్రోక్‌ను ముందే కనిపెట్టేయొచ్చు, జస్ట్ సెల్ఫీ తీసుకుంటే చాలు - కొత్త యాప్ కనిపెట్టిన పరిశోధకులు
స్ట్రోక్ వచ్చే ముందు వ్యక్తి శరీరంలో, ముఖంలో చాలా మార్పులు వస్తాయని అంటున్నారు సైంటిస్టులు. ఫేస్ రికనైజేషన్ ద్వారా దాన్ని ముందే కనిపెట్టొచ్చు అని, దానికి కొత్త డివైజ్ ను కనుక్కున్నారు.
Facial recognition tool to detect stroke: ఈ బిజీ లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మానసిక క్షోభ, ఆలోచనలు, ఇబ్బందులు కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. ఇది ఎవరికి ఎప్పుడు అటాక్ అవుతుందో అర్థం కాదు. ఒక్కోసారి దాని లక్షణాలను కూడా అంచనా వేయలేరు. ఏదో ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్య సమస్య వచ్చింది అని అనకుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ముఖం స్కాన్ చేసి స్ట్రోక్‌ను ముందే కనిపెట్టొచ్చు. అది కూడా ఫోన్ ఉంటే చాలు. ఒక యాప్ ద్వారా దాన్ని కనిపెట్టొచ్చు. స్ట్రోక్ వచ్చే ముందు వ్యక్తి శరీరంలో, ముఖంలో కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని వాటి ద్వారా ఈ ఏఐ యాప్ కనుక్కుంటుందని దీన్ని కనిపెట్టిన పరిశోధకులు చెబుతున్నారు. 85 శాతం ఫలితాలు కరెక్ట్ గా వస్తున్నాయని పేర్కొన్నారు.
లక్షణాలు ఇలా ఉంటాయి
స్ట్రోక్ వచ్చే ముందు తిక్క తిక్కగా ప్రవర్తించడం, కండరాలపై పట్టు కోల్పోవడం, మాట నంగిగా రావడం, ముఖ కవలికలు మారిపోవడం లాంటివి జరుగుతాయని చెప్తున్నారు డాక్టర్లు. ఫోన్ లోని ఏఐ యాప్ ద్వారా దాన్ని ముందే పసిగట్టొచ్చని అంటున్నారు. దానికి సంబంధించి స్టడీస్ ని కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఇన్ బయో మెడిసిన్ అనే జర్నల్ లో ప్రచురించారు. స్ట్రోక్ వచ్చే ముందు ముఖ కవలికల్లో మార్పు వస్తుందని.. దానివల్ల ఈజీగా కనిపెట్టొచ్చని అంటున్నారు. ఇది కనుక్కునేందుకు ఒక ఏఐ టూల్, ఇమేజ్ ప్రాసెసింగ్ టూల్ ని ఉపయోగించినట్లు చెప్పారు రిసర్చ్ లు. ఇది దాదాపు 85 శాతం కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు.
దీనిపై స్టడీ చేసేందుకు 14 మంది స్ట్రోక్ వచ్చిన వాళ్ల వీడియో కాల్ ఫేస్ ఎక్స్ ప్రషన్స్, 11 మంది ఆరోగ్యంగా ఉన్నవారి శాంపిల్స్ తీసుకున్నట్లు చెప్పారు. ఈ పక్షవాతాన్ని ముందే తెలుసుకుంటే.. ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలు కాపాడవచ్చని, దానికి ఇది బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు డాక్టర్లు. ఎమర్జెన్సీ డిపార్ట మెంట్ లో దాదాపు 13 శాతం స్ట్రోక్స్ ని గుర్తించలేకపోతున్నామని, చాలామంది కనీసం టెస్ట్ లు చేయించుకోకుండానే, బ్రెయిన్ స్ట్రోక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. పల్లెటూళ్లలో ఇవి ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని, ఇలాంటి టూల్స్ ఉంటే చాలా ప్రాణాలు కాపాడొచ్చని అంటున్నారు డాక్టర్లు. ఈ యాప్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.