అన్వేషించండి

Smoking: ధూమపానంతో కంటిచూపుకు పొంచి ఉన్న ప్రమాదం - త్వరగా కంటి శుక్లాలు వచ్చే అవకాశం

ధూమపానం ఎంతో ప్రమాదకరమైనదని తెలిసి కూడా కొంతమంది దాన్ని వదిలలేకపోతున్నారు.

ధూమపానం వల్ల ఎన్నో రకాల రోగాలు వస్తాయని అందరికీ తెలిసింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ. అయితే ధూమపానం వల్ల కంటి చూపుకు కూడా నష్టం కలుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ధూమపానం చేయని వారితో పోలిస్తే చేసేవారిలో త్వరగా కంటిచూపు పోయే అవకాశం ఉంది. అలాగే కంటి శుక్లాలు వచ్చే ఛాన్సులు ఎక్కువ. ఒక కంటిలో కాదు రెండు కళ్ళల్లో కూడా కంటి శుక్లాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ధూమపానాన్ని దూరంగా పెట్టాలి. ముఖ్యంగా వృద్ధులు ధూమపానం చేయడం పూర్తిగా మానేయాలి. 

కంటి చూపుకి ఎలా నష్టం?
సిగరెట్ తాగడం వల్ల కంటి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇది కంటిలోని ప్రధాన భాగాలపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అస్పష్టమైన దృష్టి, మసక మసక మబ్బుల్లా కనిపించడం, చివరికి అంధత్వానికి కారణం అవుతుంది. సిగరెట్ కాల్చడం వల్ల రెండు వందలకు పైగా హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. అవన్నీ కంటిని చేరి కంటిలోని భాగాలను ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రెటీనా, లెన్స్, మాక్యులా... ఈ మూడింటి పై ప్రభావం చూపిస్తాయి. రెటీనా కాంతిని ప్రాసెస్ చేసే ముఖ్యమైన భాగం.  ఇక లెన్స్ బయటి కాంతి రెటీనాను చేరుకోవడానికి  అనుమతిస్తుంది. మాక్యులా చిన్న చిన్న వస్తువులు కూడా కనిపించేలా చేస్తుంది. రెటీనాలోని చాలా సున్నితమైన భాగం. ఇది పదునైన దృష్టిని అనుమతిస్తుంది. ఈ మూడు భాగాలు ధూమపానంలోని రసాయనాల వల్ల దెబ్బతినే అవకాశం ఉంది.  అందుకే కంటి ఆరోగ్యం కోసం ధూమాపానాన్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. 

సిగరెట్ కాల్చాక వచ్చే పొగలో 7000 కంటే ఎక్కువ రసాయనాలు ఉంటాయి. వీటిలో  69 రసాయనాలు క్యాన్సర్ కారకాలు. అందుకే సిగరెట్ కాల్చే వారికి అధికంగా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ధూమపానం వల్ల నోటిలో పుండ్లు పడి అవి క్యాన్సర్ గా మారతాయి. వీరు జీవించే అవకాశం తక్కువ. పొగతాగే అలవాటు ఉన్న వారిలో మూత్ర పిండాల పనితీరు కూడా మందగిస్తుంది.  అధిక రక్తపోటు సమస్యను పెంచుతుంది. హైబీపీ, మధుమేహం ఉన్నవారు ధూమపానానికి దూరంగా ఉండాలి.పొగాకులో ఉండే నికోటిన్ కళ్లను తెబ్బతీస్తుంది. గ్లకోమా వచ్చే ఛాన్సులను పెంచుతుంది. 

ప్రపంచంలో పొగాకును వినియోగించే దేశాల్లో మన దేశం రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. కేవలం ధూమపానం కారణంగా అనారోగ్యాల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ప్రతి ఏడాది ఏడు లక్షలకు పైమాటే.

Also read: బర్గర్‌ను ఒక పేపర్లో చుట్టి ఇస్తారు కదా, ఆ పేపర్ ఎంత ప్రమాదకరమైనదో తెలుసా

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget