IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Flys In Eyes : అతని కంట్లో ఈగల కాపురం - గుడ్లు కూడా పెట్టేశాయి ! తర్వాతేం జరిగింది ?

ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తికి కంట్లో విపరీతంగా మంట పడుతూండటంతో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు స్కానింగ్ చేస్తే రెటీనా చుట్టూ ఈగ లార్వా ఉన్నట్లుగా గుర్తించారు.

FOLLOW US: 

ఫ్రాన్స్‌కు ( France ) చెందిన గుర్రాలు, గొర్రెల్ని  పెంచుతూ బతికేస్తూంటాడు . అయితే అతనికి కొంత కాలం నుంచి కంట్లో ఏదో పడినట్లుగా అనిపిస్తూ ఉంది. ఏదైన నలక పడిందేమో అని తీయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు కానీ రాలేదు. అసలే ఏమైనా ఉందో లేదో కూడా కనిపించలేదు. ఆ బాధ భరించడం కష్టం కావడంతో చివరికి   వైద్యుల్ని సంప్రదించాడు. మొదట టెస్ట్ చేసిన వైద్యులకు ఏమీ కనిపించలేదు.  దీంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకుని మరింత లోతుగా టెస్టులు చేశారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. అక్కడ ఈగ లార్వా ఉన్నట్లుగా గుర్తించారు. కనీసం పన్నెండు ఈగ గుడ్లు ఉన్నాయని అవి ..  ఆ వ్యక్తి రెటీనా చుట్టూ ఉన్నాయని తేలింది. 

నాంది సినిమాను గుర్తుచేసే సంఘటన, 16 ఏళ్ల తర్వాత తండ్రిహత్య కేసు చేధించిన కుమార్తె
 
న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌ ఈ అసాధారణ కేసు గురించి ప్రచురించింది. వైద్యులు ( Doctors ) ఇచ్చిన నివేదిక ప్రకారం కంటి పరీక్షలో కార్నియా చుట్టూ 'డజనుకు పైగా లార్వా' ( Fly larwa )  కనిపించింది. సమస్యను స్పష్టంగా గుర్తించిన తర్వాత, వైద్యులు ఫోర్సెప్స్‌ని ఉపయోగించి మనిషి కంటి నుండి అన్ని లార్వాలను ఒక్కొక్కటిగా తొలగించారు. అవి ఈగ జాతికి చెందిన  షీప్ బోట్ ఫ్లై రకానికి చెందిన లార్వాగా గుర్తించారు. అవి లోపలికి ఎలా వెళ్లాయో వైద్యులు గుర్తించలేకపోయారు. కానీ లార్వా కంటిలోకి ప్రవేశించిన తర్వాత వాటిని తొలగించడం అంత సులభం కాదని వైద్యులు చెబుతున్నారు.  జీవులకు దంతాల్లాంటివి ఉంటాయని అవి కార్నియాకు ( Cornia )అతుక్కొని ఉంటాయని.. వాటిని తొలగించేటప్పుడు కార్నియాకు ప్రమాదం ఏర్పడవచ్చని చెబుతున్నారు. 

యుద్ధం చేయలేక మా మహిళలపై అత్యాచారం చేస్తున్నారు: ఉక్రెయిన్

ఈ ఘటనలో ఫ్రాన్స్ వ్యక్తి అదృష్టవంతుడని డాక్టర్లు   ( Eye Doctors ) చెబుతున్నారు. ఎందుకంటే ఒక కంటిలోనే లార్వా ఉంది. రెండో కంటిలో లార్వా లేదు. రెండు కళ్లలోనూ ఉన్నట్లయితే మరింత సమస్య అయ్యేదని చెబుతున్నారు. ఆపరేషన్ చేసి లార్వాను తొలగించిన తర్వాత ఆ వ్యక్తి వేగంగా కోలుకున్నాడని వైద్యులు ప్రకటించారు. వైద్య పరిభాషలో ఇలాంటివి అరుదైనవని మెడికల్ జర్నల్స్ చెబుతూ ఉంటాయి. అయితే లార్వా కంటి లోపలికి ఎలా వెళ్లిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అందుకే ఇవి మిరకిల్స్ గా నిలిచిపోతూంటాయి. 

Published at : 14 Apr 2022 01:27 PM (IST) Tags: Fly France News Fly larva in Eye Medical Journal News

సంబంధిత కథనాలు

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Clay Pot: ఫ్రిజ్‌లో నీళ్ల కన్నా కుండలో నీళ్లు తాగడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

Clay Pot: ఫ్రిజ్‌లో నీళ్ల కన్నా కుండలో నీళ్లు తాగడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

Male Fertility: అబ్బాయిలు జర జాగ్రత్త, వీటిని తింటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది

Male Fertility: అబ్బాయిలు జర జాగ్రత్త, వీటిని తింటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది

Covid 19: దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు- 18 మంది మృతి

Covid 19: దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు- 18 మంది మృతి

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!