అన్వేషించండి

Antidepressants: ఈ మందులు వాడుతున్నారా? ప్రమాదం పొంచి ఉందేమో జాగ్రత్త

Antidepressants Side Effects : డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులను సరిచెయ్యడంలో యాంటీడిప్రెసెంట్స్ వాడడం ముఖ్యం అవుతుంది. కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు మాత్రం తప్పవు.

Antidepressants Side Effects Weight Gain And Other: తీవ్రమైన డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి సైకియాట్రిస్టులు యాంటీడిప్రెసెంట్లను సూచిస్తుంటారు. ఇవి మానసిక స్థితిని మెరుగుపరిచినప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు తప్పకుండా ఉంటాయి. ఈ మందులు వాడే ముందు దుష్ప్రభావాల గురించిన అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. వీటి ప్రభావం ఎలాంటి మందులు వాడుతున్నాం, ఎంత మోతాదులో వాడుతున్నాం, ఆ మందులకు ఎలాంటి ప్రతిస్పందనలు ఉంటున్నాయన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోరకం మందుల దుష్ప్రభావం ఒక్కోరకంగా ఉండొచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం.

వికారం, జీర్ణ సమస్యలు

యాంటీ డిప్రెసెంట్స్ వాడే వారిలో తరచుగా కనపించే దుష్ప్రభావం వికారం. ముఖ్యంగా చికిత్స మొదలు పెట్టిన తొలిరోజుల్లో కొంత మంది విరేచనాలు, మలబద్దకం, కడుపులో క్రాంప్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే రోజులు గడిచేకొద్దీ ఈ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. కానీ కొంత మందిలో మాత్రం ఇవి దీర్ఘకాలం పాటు వేధించవచ్చు.

బరువు పెరగడం

కొంత మందిలో శరీర బరువు పెరుగే ప్రమాదం ఉంటంది. ముఖ్యంగా సెలెక్టివ్ సెరోటినిన్ రీ ఆప్టెక్ ఇన్హిబీటర్స్, ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ వంటి యాంటీ డిప్రెసెంట్స్ తో బరువు పెరగవచ్చు. బరువు పెరగడానికి  ఆకలి పెరగడం, జీవక్రియల్లో వచ్చిన మార్పులు, శరీరంలో ఫ్లూయిడ్స్ నిలిచిపోవడం వంటి కారణాలు ఉండవచ్చు. ఇప్పటికే అతి బరువు తో బాధపడుతున్న వారికి ఈ సమస్య మరింత బాధాకరం అవుతుంది.

లైంగిక పటుత్వం తగ్గడం

ఈ సమస్య స్త్రీ పురుషులిద్దరినీ ప్రభావితం చెయ్యవచ్చు. యాంటీ డిప్రెసెంట్లు వాడేవారిలో చాలా మందిలో ఈ సమస్య సర్వసాధారణం. ఈ మందుల ప్రభావం వల్ల కోరిక తగ్గడం, లైంగిక తృప్తి లేకపోవడం, పరుషుల్లో అంగస్థంభన సమస్యలు వేధిస్తాయి. ఈ సమస్యలతో దాంపతుల మధ్య అనుబంధం మీద, జీవన నాణ్యత మీద ప్రభావం చూపుతాయి. మందులు మార్చడం లేదా డోసేజుల్లో మార్పులు చేస్తే ఇవి తగ్గుముఖం పడుతాయి.

నీరసం

కొన్ని యాంటీడిప్రెసెంట్స్ మూడ్ ని ఉత్తేజితం చేస్తాయి. కొన్నింటి వల్ల నీరసంగా, మగతగా ఉండే ప్రమాదం ఉంటంది. ఈ దుష్ప్రభావాలతో ఏకాగ్రత తగ్గడం మాత్రమే కాదు రోజూ వారీ జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి.

నిద్ర లేమి

కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లు స్టిమ్యూలేటింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. వీటి వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. నిద్ర లేమి మరింత ఎక్కువ డిప్రెషన్ కు కారణం కాగలదు. కనుక యాంటీడిప్రెసెంట్లు వాడే వారు నిద్రలేమి సమస్యతో బాధ పడుతుంటే మాత్రం తప్పకుండా వారి డాక్టర్ తో చర్చించాలి.  మందులు మార్చే అవకాశం ఉంటుంది.

సెరెటోనిన్ సిండ్రోమ్

కొన్ని మందులతో సెరెటోనిన్ స్థాయిలు పెరిగి పోతే ప్రాణాంతక స్థితి కలుగవచ్చు. కన్ఫ్యూజన్, గుండెదడ, బీపీ పెరగిపోవడం వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చు. వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరమవుతుంది.

ఇవే కాదు కంటి చూపు మసకబారడం, కళ్లు తిగిగినట్లు ఉండడం, ఆందోళన పెరగడం, చెమట పట్టడం, మూర్ఛ, ఆత్మహత్య ఆలోచనల వంటి ఇతర దుష్ప్రభావాలు కూడా కనిపించవచ్చు. ఇలాంటి దుష్ప్రభావాల్లో ఏవి కనిపించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించి మందులు మార్చుకోవడం లేదా మోతాదుల్లో మార్పులు చేసుకోవడం అవసరమని గుర్తించాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్‌ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి... ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు 'ఏబీపీ దేశం', 'ఏబీపీ నెట్‌వర్క్‌' ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget