(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips : దీర్ఘకాలికంగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారా? జాగ్రత్త, ఈ జబ్బు ఎటాక్ చేయొచ్చు!
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అత్యంత రిస్క్ కల్పించే వ్యాధి స్ట్రోక్. డయాబెటిస్ దీర్ఘకాలం ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్, స్ట్రోక్ మధ్య సంబంధం తెలుసుకుందాం.
డయాబెటిస్ దీర్ఘ కాలం ఉన్నట్లయితే అది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మెదడులో ప్రాణవాయువు, పోషకాల కొరత ఏర్పడినప్పుడు స్ట్రోక్ వస్తుంది. రక్త నాళాలు దెబ్బతిన్నప్పుడు లేదా బ్లాక్ ఏర్పడినప్పుడు స్ట్రోక్ వస్తుందని తెలిపారు. డయాబెటిస్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు రక్తనాళాలను దెబ్బతీయడంతోపాటు.. స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. డయాబెటిస్ అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి ఇతర వ్యాధులకు ప్రమాద కారకంగా ఉంటుంది. ఇది స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
డయాబెటిస్ స్ట్రోక్ మధ్య లింక్:
డయాబెటిస్ ఒక చిత్రమైన వ్యాధి. ఇది రక్త ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంటే శరీరంలోని రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. తద్వారా సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిస్‌ను రెండు వర్గాలుగా విభజించారు.మైక్రోవాస్కులర్ మాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్.. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. అంటే శరీరంలోని చిన్న రక్తనాళాలు కళ్ళు, కిడ్నీ నరాల వంటి వాటిని ప్రభావితం చేస్తాయి. రెండోది గుండె, మెదడు కాళ్ళపై కూడా ప్రభావం చూపిస్తాయి.
డయాబెటిస్ కలిగి ఉండటం వలన స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. ఇది మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలు అడ్డుకోవడం వల్ల వస్తుంది. స్ట్రోక్ అనేది మెదడుకు గుండెపోటు లాంటిది. దీనికి కారణం మెదడులో ఆటంకం ఏర్పడుతుంది. రక్తనాళాలలో తాత్కాలికంగా ఏర్పడే అడ్డంకి కారణంగా మెదడుకు జరిగే నష్టం శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది.
డయాబెటిస్ తో పాటు, స్ట్రోక్‌కి ఇతర ప్రమాద కారకాలు ఉన్నాయి. అవి హైపర్‌టెన్షన్ , ధూమపానం అధిక కొలెస్ట్రాల్ కూడా కారణమని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్న రోగి బ్లడ్ షుగర్‌లను నియంత్రించడంతో పాటు, రక్తపోటు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మహిళల్లో డయాబెటిస్ స్ట్రోక్ మధ్య లింక్:
డయాబెటిస్, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ మధ్య ఉన్న క్లిష్టమైన సంబంధం ఉంది. అయితే సాధారణంగా మహిళల్లో డయాబెటిస్ ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉంటాయి. దీంతో ఇది మహిళల్లో స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులు, మెటబాలిక్ డిస్‌రెగ్యులేషన్ కూడా కారణం అవుతుంటాయి. ఈ నేపథ్యంలో మహిళలు ప్రత్యేకంగా డయాబెటిస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం జీవనశైల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఆహారం విషయంలోనూ, శారీరక శ్రమ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
జీవనశైలి మార్పులు మీ ఆరోగ్యాన్ని నియంత్రించడానికి ఉపయోగపడతాయి. డయాబెటిస్, స్ట్రోక్ ఈ రెండూ ప్రమాదాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే డయాబెటిస్ నివారణ కోసం కఠినంగా ఉంటే మంచిది. . ముఖ్యంగా ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే స్ట్రోక్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.
Also Read : బరువును వేగంగా తగ్గించి.. డయాబెటిస్‌ను కంట్రోల్ చేసే ఫుడ్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.