News
News
X

పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ పరీక్ష చేయించుకోవడం బెటర్

కాలేయానికి ఏ సమస్య వచ్చినా ప్రాథమికంగా అది బయటపడదు. కాస్త ముదిరాకే తెలుస్తుంది.

FOLLOW US: 
Share:

శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కాలేయం కూడా ఒకటి. ఇది సరిగా పనిచేయకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇది రక్తం నుండి హానికరమైన పదార్థాలను తొలగించి శరీరాన్ని కాపాడుతుంది. గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేసి నిల్వ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రింస్తుంది. కొవ్వులను జీర్ణం చేయడానికి, విటమిన్లను గ్రహించడానికి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి కాలేయం చాలా అవసరం. అందుకే కాలేయం చెడిపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీవించడం కూడా కష్టంగా మారుతుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి కాలేయానికి వస్తుంది. దీన్ని ప్రారంభ దశల్లో గుర్తించడం కాస్త కష్టమే, కానీ వ్యాధి ముదిరే కొద్ది కొన్ని ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు. 

పాదాల నొప్పి 
పాదాల్లో నొప్పి కలగడం అనేది కాలేయ వ్యాధికి ఒక సంకేతం. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. కాలేయం సరిగా పనిచేయనప్పుడు అది అదనపుద్రవాన్ని మిగిలిస్తుంది. అది శరీరం దిగువకు చేరి, టాక్సిన్స్ రూపంలో పేరుకుపోతుంది. అంటే పాదాలలో పేరుకు పోతుంది. దీన్ని పెరిఫెరల్ ఎడెమా అని అంటారు. అప్పుడు పాదాలు వాచినట్టు, ఉబ్బినట్టు కనిపిస్తాయి. నొప్పి కూడా వస్తుంది. సిర్రోసిస్ వంటి కొన్ని కాలేయ వ్యాధులు కూడా ‘పోర్టల్ హైపర్ టెన్షన్’ అనే పరిస్థితిని కలిగిస్తాయి. ఇది కూడా కాళ్లు, పాదాల్లో సిరలు అనారోగ్యంగా మారేలా చేస్తుంది. 

పాదాల దురద 
పాదాల్లో దురద వేయడం చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ అది కాలేయ వ్యాధికి ఒక లక్షణం. ముఖ్యంగా ప్రైమరీ బిలియరీ సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధుల్లో పాదాలు దురదలు వేయడం ఒక సాధారణ లక్షణం. కాలేయంలో ఉండే పిత్త వాహికలు దెబ్బ తినడం వల్ల శరీరంలో పిత్తం అధికంగా పేరుకుపోతుంది. దీనివల్ల దురద వస్తుంది. చేతులు కాళ్లు చాలా దురదపెడతాయి. పాదాల్లో ఈ దురద అధికంగా ఉంటుంది. 

తిమ్మిరి
కాళ్లు, పాదాలు తిమ్మిరి పెట్టడం చాలా సాధారణ విషయమే. కానీ తరచూ తిమ్మిరి పెడుతుంటే మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ లేదా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వచ్చిన వాళ్లలో పాదాల తిమ్మిరి, జలదరింపు అధికంగా ఉంటుంది. చేతులు కాళ్లలోని నరాలు కూడా ప్రభావితం అవుతాయి. 

ఇతర లక్షణాలు
మాయో క్లినిక్ చెప్తున్న ప్రకారం కాలేయ వ్యాధి వచ్చినప్పుడు ఇతర కొన్ని సాధారణ లక్షణాలు కూడా కనిపిస్తాయి.

1. చర్మం, కళ్ళు పసుపు రంగులో మారుతాయి.
2. కడుపులో నొప్పి, వాపు వస్తుంది.
3. చర్మం దురద పెడుతుంది.
4. మూత్రం రంగు ముదురుగా మారుతుంది.
5. మలం రంగు లేతగా మారుతుంది.
6. అలసట తీవ్రంగా ఉంటుంది

ఈ లక్షణాలు తరచూ కనిపిస్తున్నప్పుడు కచ్చితంగా ఓసారి కాలేయాన్ని పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 

Also read: అద్భుతం, 32వేల సంవత్సరాల నాటి విత్తనాల నుండి చిగురించిన మొక్క

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 21 Jan 2023 06:53 AM (IST) Tags: Liver problems Symptoms in Feet Liver Test to done

సంబంధిత కథనాలు

Screen Time: ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల కంటిచూపుకే కాదు - చర్మం, జుట్టుకూ నష్టమే

Screen Time: ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల కంటిచూపుకే కాదు - చర్మం, జుట్టుకూ నష్టమే

Cauliflower: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు

Cauliflower: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు

Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?

Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?

అది ప్రేమ హార్మోన్ కాదు, ఆ హార్మోన్ లేకున్నా మనం ప్రేమించగలం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

అది ప్రేమ హార్మోన్ కాదు, ఆ హార్మోన్ లేకున్నా మనం ప్రేమించగలం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

గంజి నీళ్ళతో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే, మీరు కూడా గంజి వచ్చేలా అన్నం వండుతారు

గంజి నీళ్ళతో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే, మీరు కూడా గంజి వచ్చేలా అన్నం వండుతారు

టాప్ స్టోరీస్

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!