Chicken Soup: నాన్ వెజ్ లవర్స్ కోసం... చికెన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలి? వర్షాకాలంలో చికెన్ సూప్ తీసుకోవడం మంచిదేనా?
నాన్ వెజ్ ప్రియుల కోసం ఇప్పుడు చికెన్ సూప్ (Chicken Soup) ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

వర్షం వస్తుందంటే చాలు... వేడివేడిగా సూప్‌లు తాగాలనిపిస్తోంది. నాన్ వెజ్ ప్రియుల కోసం ఇప్పుడు చికెన్ సూప్ (Chicken Soup) ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
Also Read: Hot or cold shower: చన్నీళ్లు లేదా వేణ్నీళ్లు... ఏ నీళ్లతో స్నానం చేస్తే బెటర్?
కావల్సిన పదార్థాలు:
చికెన్ - పావు కేజీ, పసుపు - చిటికెడు, పచ్చిమిర్చి - 2, జీలకర్ర - టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత, నెయ్యి - సరిపడా, పుదీన ఆకులు - అర కప్పు,
కొత్తిమీర - ఒక చిన్న కట్ట, ఉల్లిపాయ - ఒకటి, మిరియాలు - 1/2 టేబుల్ స్పూన్, నూనె - 1 1/2 టేబుల్ స్పూన్, యాలకులు - 5, జీలకర్ర - 1/2 స్పూన్, కరివేపాకు - కొద్దిగా, ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క - రెండు చిన్న ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు - 4, అల్లం ముక్క - చిన్నది, క్యారెట్ - 1, బంగాళదుంప - చిన్నది ఒకటి, బిర్యానీ ఆకులు - 2, నీళ్లు - అర లీటరు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు.
Also Read: Health Tips: వ్యాయామం ఏ సమయంలో చేస్తే మంచిది? పిరియడ్స్ టైంలో వ్యాయామం చేయవచ్చా?
తయారీ విధానం:
* ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి.
* ఇప్పుడు మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు వేసి మెత్తటి మిశ్రంలా తయారు చేసుకోవాలి.
* ఇప్పుడు ఒక కుక్కర్లో చికెన్, ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమం, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు, ఉప్పు, అరలీటరు నీళ్లు పోసి బాగా కలిపి 4 లేదా 5 విజిల్స్ తెప్పించాలి.
* ఇప్పుడు మరో పాన్‌లో కొద్దిగా నెయ్యి వేడి చేసుకుని జీలకర్ర, బిర్యానీ ఆకు, మూడు మిరియాలు, మూడు యాలకలు, చిన్న దాల్చినచెక్క, లవంగాలు, ఒక అనాస పువ్వు వేసి కొద్దిగా వేగాక ముందుగా ఉడికించిన చికెన్‌ను వేసుకోవాలి. తర్వాత అర కప్పు పుదీనా, కొత్తిమీర వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
* ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని చల్లటి నీటిలో కలిపి ఈ చికెన్ సూప్‌లో పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. అంతే ఎంతో రుచికరమైన చికెన్ సూప్ రెడీ.
Also Read: Monsoon Skincare Tips: వర్షాకాలంలో మీ చర్మం జిడ్డుగా మారుతుందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

