X

Health Tips: వ్యాయామం ఏ సమయంలో చేస్తే మంచిది? పిరియడ్స్ టైంలో వ్యాయామం చేయవచ్చా?

సాధారణంగా వ్యాయామం చేసే చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. ఎప్పుడు వ్యాయామం చేస్తే మంచిది?

FOLLOW US: 

సాధారణంగా వ్యాయామం చేసే చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. ఎప్పుడు వ్యాయామం చేస్తే మంచిది? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు చేస్తే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి? ఈ సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఉద‌యం వ్యాయామం చేస్తే
ఉద‌యం వ్యాయామం చేయ‌డం వ‌ల్ల లాభాలు, న‌ష్టాలు ఉంటాయి. కొవ్వు క‌రుగుతుంది. కండ‌రాల నిర్మాణం జ‌రుగుతుంది. దేహ‌దారుఢ్యం కావాల‌నుకునే వారు ఉద‌యం వ్యాయామం చేయాలి. హైబీపీ, డిప్రెష‌న్ త‌గ్గాల‌నుకునే వారు కూడా ఉద‌యం వ్యాయామం చేస్తే మంచిది. అయితే ఉద‌యం వ్యాయామం చేయ‌డం వ‌ల్ల గాయాల బారిన ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే శ‌క్తి స్థాయిలు త‌క్కువ‌వుతాయి.

సైంటిస్టులు చేపట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. ఉద‌యం వ్యాయామం చేసే వారికి హార్ట్ స్ట్రోక్స్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వెల్ల‌డైంది. ఇక ఊపిరితిత్తులు త‌మ సామ‌ర్థ్యాన్ని కోల్పోతాయి.

మ‌ధ్యాహ్నం వ్యాయామం
మధ్నాహ్నం వ్యాయామం చేసేవారిలో ఏకాగ్ర‌త‌, శారీర‌క ఆరోగ్యం క‌లుగుతుంది. అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న‌శైలి ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. గాయాల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అయితే ఈ వ్యాయామం ఉద్యోగాలు చేసే వారికి సూట్ అవ్వ‌దు. 

సాయంత్రం వ్యాయామం
సాయంత్రం వ్యాయామం చేయ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. ఏకాగ్ర‌త పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. గాయాల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. కానీ సాయంత్రం వ్యాయామం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. 

వర్కవుట్‌కి ముందు తినాలనుకుంటే

* వ్యాయామానికి 2-3 గంటల ముందు తినండి. గుడ్లు, మాంసం, తక్కువ కొవ్వు పాలు, చేపలు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం మర్చిపోవద్దు. మరోవైపు నీటిని కూడా సరిపడా తీసుకోవాలి.

* వ్యాయామం చేయడానికి ముందు మీకు స్వల్ప విరామం మాత్రమే ఉంటే వైట్ బ్రెడ్, ఎనర్జీ బార్స్ లేదా పండ్లు వంటి తేలికైన ఆహారాన్ని ఎంచుకోండి.

* రుతుక్రమం సమయంలో రుతుక్రమం సమయంలో వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పొట్టలో క్రాంప్స్ తగ్గుతాయి.

* జలుబు చేసినప్పుడు ఎక్సర్ సైజ్ చేయవచ్చా ? అంటే ఖచ్చితంగా చేయకూడదని చాలామంది భావిస్తారు. కానీ జలుబుతో బాధపడుతున్నప్పుడు వ్యాయామం చేయడం వల్ల దానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్స్ నిరోధించబడి, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

​ఖాళీ కడుపుతో వర్కవుట్ చేస్తే ఆరోగ్య సమస్యలు

* హైపోగ్లైసీమియా (తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు) ప్రమాదాన్ని పెంచుతుంది. మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే... మైకం కమ్మడం, వికారం, వణుకు, మూర్ఛ లాంటివి దరిచేరవచ్చు.

* ఖాళీ కడుపుతో వ్యాయామం చేసే వ్యక్తులు సాధారణంగా ఎక్కువ అలసటతో ఉంటారు. కాబట్టి స్టామినాకు మించి ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల ఉపయోగం ఉండదు.

Tags: LifeStyle Health Tips Excersice Yoga

సంబంధిత కథనాలు

Dolo 650: డోలో పై మీమ్స్ మామూలుగా లేవుగా... సోషల్ మీడియాలో ఇప్పుడిదో సెలెబ్రిటీ

Dolo 650: డోలో పై మీమ్స్ మామూలుగా లేవుగా... సోషల్ మీడియాలో ఇప్పుడిదో సెలెబ్రిటీ

Shocking: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....

Shocking: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....

khasi Tribe: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు

khasi Tribe: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు

National Girl child Day: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి

National Girl child Day: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి

Heart Problems: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే

Heart Problems: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే

టాప్ స్టోరీస్

Schools Reopen: తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే ఛాన్స్ 

Schools Reopen: తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే ఛాన్స్ 

AP Employees Strike Notice : ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

AP Employees Strike Notice :   ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!