What Happens To Your Body During Anesthesia: అనస్థీషియా ఎలా పని చేస్తుంది? దానికి సంబంధించిన రహస్యాలు ఏమిటి?
ఆపరేషన్లు జరిపేటపుడు నొప్పి తెలీకుండా పేషెంట్ మత్తులోకి జారుకునేందుకు అనస్థీషియా ఉపయోగిస్తారు. కానీ వాటి ప్రభావాలను సైంటిస్టులు ఇంకా పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారట.
How Does Anesthesia Put You To Sleep: అనస్థీషియాలో వివిధ రకాలు ఉంటాయి. అవి పనిచేసే విధానాలు కూడా వేరుగా ఉంటాయి. కానీ వాటి ప్రభావాలను సైంటిస్టులు ఇంకా పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారట. ఆపరేషన్లు చేసే సమయంలో నొప్పి తెలీకుండా పేషెంట్ మత్తులోకి జారుకునేందుకు అనస్థీషియా ఉపయోగిస్తారు. రాతి యుగంలో పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. పురాతన పుర్రెలలో రంధ్రాలు వేసినట్లు కూడా కనిపించాయి. ఉదాహరణకు బోర్నియోలో 31,000 సంవత్సరాల నాటి అవశేషాలు దొరికాయి. అయినప్పటికీ 1840ల వరకు అనస్థీషియా వాడకం విస్తృతంగా వ్యాపించలేదు. ఆ తర్వాతి కాలంలో ఆపరేషన్ జరిపేటపుడు నొప్పి తెలియకుండా ఉండటానికి ఈథర్ గ్యాస్‌ను ఉపయోగించవచ్చని ఒక డెంటిస్ట్ నిరూపించాడు.
అనస్థీషియా సరిగ్గా ఎలా పని చేస్తుంది?
UCLA హెల్త్ ప్రకారం, వివిధ రకాలైన అనస్థీషియాను వేర్వేరు ఆపరేషన్లకు ఉపయోగిస్తారు .
లోకల్ అనస్థీసియా
పేషెంట్ కి స్పృహ కోల్పోకుండా రిలాక్స్‌గా, మగతగా ఉండేలా చేయడానికి బయాప్సీలు, చిన్న చిన్న డెంటల్ ట్రీట్మెంట్ల కోసం లోకల్ అనస్థీసియా వాడుతారు. ఇది నిర్దిష్ట భాగాలను మాత్రమే నంబ్ చేస్తుంది. పేషెంట్ ను మెలకువగా ఉంచుతుంది.
రీజియనల్ అనస్థీసియా
ప్రసవ సమయంలో ఇచ్చే ఎపిడ్యూరల్స్ వంటి రీజియనల్ అనస్థీషియా, శరీరం మొత్తానికి స్పర్శ లేకుండా చేస్తుంది. మేజర్ సర్జరీలకు జనరల్ అనస్థీషియాను వాడుతారు. ఇది మొత్తం శరీరాన్ని మొద్దుబారుస్తుంది. పేషెంట్ ను స్పృహ కోల్పోయేలా చేస్తుంది.
వివిధ రకాల మత్తుమందులు విభిన్న మార్గాల్లో పని చేస్తాయి. లోకల్ అనస్థీసియా ..మెదడుకు నొప్పి సంకేతాలను పంపకుండా నరాల కణాలను అడ్డుకుంటుంది . ఈ కణాలలో ఉండే ఛానల్స్ ద్వారా చార్జ్ చేసిన సోడియం అయాన్ల ప్రవాహాన్ని ఆపుతుంది. ఇది సోడియం అయాన్ల ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక న్యూరాన్‌ను దాని పొరుగువాటికి సిగ్నల్‌ను షూట్ చేయడానికి ప్రేరేపిస్తుంది. ఎక్కువ మోతాదులో అనస్థీసియా ఇస్తే ప్రమాదాలు సంభవించవచ్చు. మూర్ఛ, రెస్పిరేటరీ అరెస్ట్, కోమాకు దారితీయవచ్చు. అందుకని అనస్థీసియా ఇవ్వటానికి స్పెషలిస్టులు తప్పనిసరిగా అన్ని ఆపరేషన్ థియేటర్లలో ఉంటారు. మత్తుమందులు కొన్ని నరాల్లోకి ఎక్కించేవి కొన్ని శ్వాస ద్వారా ఇచ్చేవి ఉంటాయి. అనస్థీషియాలజిస్ట్ పేషెంట్ పిల్లలా, పెద్దలా అనేదాని బట్టి సరైన పద్ధతుల్లో అనస్థీసియా ఇస్తారు.
ఆపరేషన్ కు ముందు కొందరికి మత్తుమందు ఇచ్చి పేషెంట్ అన్ కాన్షియస్ అయిన తర్వాత సర్జరీ ప్రాసెస్ మొదలు పెడుతారు. అయితే, కొన్ని సందర్భాల్లో సర్జరీ పూర్తయ్యే వరకు పేషెంట్ ను అన్ కాన్షియస్‌లో ఉంచటానికి శ్వాస ద్వారా అనస్థీసియాను ఇస్తుంటారు. ఎక్కువగా ఉపయోగించే అనస్థెటిక్స్ లో ప్రొపొఫోల్, గామా-అమినోబ్యూట్రిక్ యాసిడ్ ఒకటి. ఇది నొప్పి కలిగించే న్యూరాన్ లను కంట్రోల్ చేస్తుంది. గామా ఆధిక మోతాదులో ఇస్తే అపస్మారక స్థితికి వెళ్లే ప్రమాదం ఉంది. మెదడుకు అనస్థెటిక్, సెడేటివ్ ఎఫెక్ట్స్ ని కలిగించే కీ రెసెప్టర్స్ ని గుర్తించినప్పటికీ, అనస్థీసియా ఎలా పని చేస్తోందన్న పూర్తి అవగాహన ఇంకా రాలేదని సైంటిస్టులు చెప్తున్నారు.
అనస్థీసియా నిద్రపుచ్చటానికి ఎలా పనిచేస్తుందో పూర్తి వివరాలు తెలియనట్లే, న్యూరల్ సర్క్యూట్స్ తిరిగి నార్మల్ గా ఎలా పనిచేస్తున్నాయనే విషయాల మీద కూడా సైంటిస్టులకు పూర్తి అవగాహన లేదు. కొంతమంది పరిశోధకులు రిటాలిన్ వంటి స్టిమ్యులంట్స్ తొందరగా స్పృహలోకి రావటానికి ఎలా తోడ్పడతాయనే దాని మీద పరిశోధనలు జరుపుతున్నారు.