FSSAI guidelines for protein supplements : ప్రోటీన్ పౌడర్ అమ్మకాలపై FSSI కొత్త నిబంధనలు.. కల్తీ లేకుండా చూసేందుకు నిర్ణయం
Protein supplement side effects in India : ప్రోటీన్ పౌడర్ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రమాదాలు వస్తున్నాయని తాజా అధ్యాయనం తెలిపింది. దీనిపై FSSAI కూడా కఠిన నిబంధనలు తీసుకుంటుంది.
New regulations for protein powder in India : శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ముఖ్యంగా జిమ్‌కి వెళ్లి కష్టపడేవారు.. శరీరానికి ప్రోటీన్ అందించడం కోసం వివిధ రకాల ఫుడ్స్‌తో పాటు.. కొన్ని ప్రోటీన్ సప్లిమెంట్స్‌ని ఆశ్రయిస్తారు. అయితే ప్రోటీన్ సప్లిమెంట్స్ వినియోగం వల్ల ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయని.. కల్తీ ప్రోటీన్‌ను సప్లిమెంట్స్‌గా అమ్మేస్తున్నారని (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)FSSAI గుర్తించింది. ఈ నేపథ్యంలోనే వాటి వినియోగంపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలని చూస్తుంది.
ఫిట్నెస్ ఫ్రీక్స్ మాత్రమే కాకుండా.. ఈ మధ్య డాక్టర్లు కూడా ప్రోటీన్ వినియోగించాలని సూచిస్తున్నారు. అథ్లెట్స్ కూడా దీనిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రోటీన్‌కు ప్రజాదరణ పెరిగింది. దీనినే క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రోటీన్‌ను కల్తీ చేస్తున్నారు. వాటిలో శరీరానికి హానిచేసే పదార్థాలు ఉన్నాయంటున్నారు. FSSAI అధికారి మాట్లాడుతూ.. మార్కెట్లో చాలా ప్రోటీన్ ఉత్పత్తులు చాలా ఉన్నాయని.. వాటితో ప్రయోజనాలు కంటే ఆరోగ్య సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. అందుకే వినియోగదారులు జాగ్రత్తగా ఆరోగ్య స్పృహతో ఉండాలంటున్నారు.
ప్రోటీన్‌లో పాదరసం ఉందట..
ప్రస్తుతం మార్కెట్లలో అమ్ముతున్న ప్రోటీన్ సప్లిమెంట్స్‌లో పాదరసం, లెడ్ వంటి భారీ లోహాలు ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ఇవి శరీరంలో ఎక్కువగా పేరుకుపోయి.. కాలక్రమేణా గణనీయమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అంతేకాకుండా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఉంటున్నట్లు గుర్తించారు. ఇవి శరీరంలో చేరితే వాటి ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇవి అలెర్జీ సమస్యలకు కారణమవుతున్నాయని చెప్తున్నారు. వీటివల్ల కడుపులో ఇబ్బందులు, వాంతులు, డయేరియా, అబ్డామినల్ పెయిన్, బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదముంది.
నిబంధనలో మార్పులు
ఈ సమస్యను తగ్గించేందుకు FSSAI కొత్త నిబంధనలతో ఈ ప్రాబ్లమ్‌ను పరిష్కరించాలని చూస్తుంది. లేబుల్స్‌పై ఉన్న పదార్థాలు.. అంతే మొత్తంలో వేయట్లేదని స్టడీలో గుర్తించారు. అవి కూడా తప్పుగా రాస్తున్నారని అధికారులు చెప్పారు. ఇది ఉత్పత్తి భారీ లోహాలు, సూక్ష్మజీవుల వంటిపై కచ్చితంగా పరీక్షలు నిర్వహించి.. అవి లేవని తెలిశాకే వాటిని మార్కెట్లోకి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా లేబులింగ్‌లో ఎలాంటి తప్పులు ఉండకూడదని చూస్తుంది. ప్రోటీన్ కంటెంట్, పదార్థాలు, అలెర్జీ కారకాలు, సిఫార్సు చేసిన మోతాదుల గురించి లేబుల్స్‌పై వేయాలని సూచించింది.
ప్రభావం చూపించనున్న నిబంధనలు
ఈ నిబంధనలు తయారీదారులు, వినియోగదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని అధికారులు చెప్తున్నారు. మెరుగైన టెస్ట్, క్వాలిటీ టెస్ట్ చేయడం ద్వారా తయారీదారులకు ఖర్చులు పెరుగుతాయి. క్వాలిటీ కలిగిన మంచి ప్రోటీన్ వినియోగదారులకు కూడా మేలు చేస్తుందని తెలిపారు. దీనివల్ల నకిలీ, నాసిరకం ఉత్పత్తులు తగ్గుతాయి. ఇవి వినియోగదారులకు మేలు చేస్తాయి.
Also Read : ఉదయం లేచిన వెంటనే ఆ సమస్యలున్నాయా? అయితే మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశముంది జాగ్రత్త