News
News
X

Red Wine: రెడ్ వైన్ తాగడం వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ కూడా ఒప్పుకుంది

రెడ్ వైన్ తాగడం వల్ల ఎన్నో అనారోగ్యాలను దూరం పెట్టవచ్చని శాస్త్రీయంగా నిరూపణ అయింది.

FOLLOW US: 
Share:

రెడ్ వైన్లో ఆల్కహాల్ కలిపినదే కాదు, ఆల్కహాల్ కలపని రెడ్ వైన్ కూడా ఉంటుంది. ఆల్కహాల్ కలపని రెడ్ వైన్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని సైన్స్ నిర్ధారించింది. అధ్యయనాల ప్రకారం స్త్రీలు, పురుషులు మితంగా రెడ్ వైన్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. ఈ పానీయంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

మధుమేహుల కోసం
డయాబెటిస్ ఉన్నవారు రెడ్ వైన్ తాగవచ్చా లేదా అనే సందేహం వారిలో ఉంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం ఆల్కహాల్ లేని రెడ్ వైన్ తాగడం వల్ల డయాబెటిక్ రోగులకు ఎంతో మంచిది. రెడ్ వైన్ రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది. రెడ్ వైన్ తాగాక 24 గంటల వరకు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచగలుగుతుంది. అందుకే మితంగా డయాబెటిక్ రోగులు రెడ్ వైన్ తాగడం వల్ల మంచే జరుగుతుంది. 

జ్ఞాపక శక్తికి 
రెడ్ వైన్లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ముఖ్యంగా రెస్వరాట్రాల్ అనే పాలీఫెనాల్ అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సరిగా నిద్రపోకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆ శక్తిని తగ్గకుండా కాపాడుతుంది రెడ్ వైన్. అభ్యాస సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది.

క్యాన్సర్‌కు చెక్
రెడ్ వైన్ తాగడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించవచ్చు. ముఖ్యంగా రొమ్ము, అన్నవాహిక క్యాన్సర్‌ను తగ్గించే సామర్థ్యం రెడ్ వైన్‌లో ఉన్నట్టు శాస్త్రీయంగా నిరూపణ అయింది. 

గుండె కోసం 
రెడ్ వైన్‌లో ఉత్తమమైన పాలీఫెనాల్స్ ఉంటాయని ముందే చెప్పుకున్నాం. అవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి కొలెస్ట్రాల్  ను బయటకు పంపేందుకు ప్రయత్నిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు రెడ్ వైన్ ఎంతో సహాయపడుతుంది. 

కళ్ళకు
రెడ్ వైన్‌లో ఉండే రెస్వరాట్రాల్ కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వయసు సంబంధంగా వచ్చే చూపు క్షీణత, మధుమేహం వల్ల కలిగే డయాబెటిక్ రెటినోపతి వంటి కంటి సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. 

దంతాల ఆరోగ్యానికి 
రెడ్ వైన్ తాగడం వల్ల నోటిలో హానికరమైన బ్యాక్టీరియా కూడా బయటికి పోతుంది. ఆ బాక్టీరియా నోట్లో ఉంటే దంత క్షయం, చిగుళ్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి రెడ్ వైన్ తాగడం వల్ల దంతాలు కూడా శుభ్రపడతాయి. 

ఆల్కహాల్ కలిపిన రెడ్ వైన్ తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం తక్కువ. కాబట్ట నాన్ ఆల్కహాలిక్ రెడ్ వైన్ ఎంచుకుని తాగడం ఉత్తమం.

Also read: కండల కోసం ప్రొటీన్ షేక్‌లకు బదులు ఈ పానీయం తాగండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 05 Feb 2023 07:36 AM (IST) Tags: Red wine Benefits Red wine for Health Health life with Redwine Redwine for Diabetics

సంబంధిత కథనాలు

Mushrooms: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి

Mushrooms: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి

Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?

Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?

World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?

World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?

Acidity: పాలు తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుందా? అది ఎంతవరకు నిజం?

Acidity: పాలు తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుందా? అది ఎంతవరకు నిజం?

పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలకు కారణం పెద్దలేనట - ఫోన్ స్క్రీన్స్‌తో ప్రాణహాని

పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలకు కారణం పెద్దలేనట - ఫోన్ స్క్రీన్స్‌తో ప్రాణహాని

టాప్ స్టోరీస్

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్